‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ఇంకో వారంలో ముగింపునకు చేరుకోనుంది. టాప్- 5లో ఒక్కరే విన్నర్ గా నిలుస్తారు. ఇంట్లోని సభ్యుల కోసం వారి సపోర్టర్స్ ఫ్యాన్స్ అందరూ తీవ్రంగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే కొందరు అభిమానులు అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తుంటారు. అందులో భాగంగానే హీరోయిన్ మాధవీలతను కొందరు అసభ్యకరంగా తిడుతూ మెసేజ్ చేస్తున్నారంటూ ఆరోపిస్తోంది. సన్నీకి సపోర్ట్ చేయండని చెప్పినందుకు కొందరి అభిమానులు ఆమెను టార్గెట్ చేశారని వాపోయింది. అంతే కాదు పరుష పదజాలంతో దూషిస్తున్నారంటూ ఆరోపించింది.
మాధవీలత ఈ మధ్య కాలంలో సిరి– షణ్ముఖ్ రిలేషన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. వారిని జంట పాములు అంటూ సంబోధించింది. షణ్ముఖ్ అభిమానులే అలా చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మాధవీ లత అలా చేసింది ఎవరు అనేది నేరుగా చెప్పకపోయినా కూడా ఇన్ డైరెక్ట్ గా మెసేజ్ చేసిన వారిపై కామెంట్ చేసింది. ‘సన్నీకి సపోర్ట్ చేస్తున్నా అని నన్ను ల**జ, బి** అని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మెసేజ్ లు పంపుతున్నారు. ఆ పదాలకు అర్థం మీఅంత గొప్పగా నాకు తెలియదు. ఎవరు అలాంటి పనులు చేస్తారో.. ఎవరు అలాంటి జీవితం బతుకుతారో వాళ్లే అలాంటి మాటలు మాట్లాడతారు’ అంటూ చురకలు అంటించింది.
‘మీ మాటలను నన్ను హార్మ్ చేయవు. మీరు ఎంత తిట్టినా నా విలువ నా పవర్ తగ్గదు. కానీ, మీరు లైఫ్ లో ఎప్పుడూ సక్సెస్ కాలేరు. మీ స్థాయి ఎప్పుడూ భూమి మీదే.. తిట్టించుకున్న నా స్థాయి ఆకాశమంత. ఆ అమ్మవారే నాకు రక్ష. యువర్ ఎవ్రీ బ్యాడ్ వర్డ్ గోస్ టూ గాడెస్.. దట్ విల్ స్మాష్ యూ’ అంటూ మాధవీ లత కూడా తీవ్రంగానే స్పందించింది. మీరు అభిమానించే వారికోసం ఎదుటి వారిని ఇంతలా దూషించడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.