టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 66వ రోజుకి చేరుకుంది. 66వ రోజు పాదయాత్ర శింగనమల నియోజకవర్గంలోని సోడనంపల్లి క్రాస్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 66వ రోజుకి చేరుకుంది. 66వ రోజు పాదయాత్ర శింగనమల నియోజకవర్గంలోని సోడనంపల్లి క్రాస్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. సెల్ఫీల కార్యక్రమం తర్వాత లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు. సోడనంపల్లి క్రాస్ విడిది కేంద్రం వద్ద యువతీ, యువకులతో లోకేష్ ముచ్చటించారు. అలానే ప్రతీ రోజూ తనని కలవడానికి వచ్చిన ప్రజలను, యువతను ఆప్యాయంగా పలకరించి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. లోకేశ్ ఓపికగా వచ్చిన అందరితో సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. జనం పెద్ద సంఖ్యలో లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. లోకేష్ ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇక, పాదయాత్ర 66వ రోజుకు చేరుకుంది. 66వ రోజు పాదయాత్ర సోడనంపల్లి క్రాస్ విడిది కేంద్రంనుంచి ప్రారంభం అయింది. ఈయాత్రలో లోకేశ్ కి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు బహ్మరథం పట్టారు. టీడీపీ మహిళ రాష్ట్ర కార్యదర్శి సాయికళ్యాణి అరెస్టు పై లోకేశ్ సీరియస్ అయ్యారు.
“ఒక మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించి పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చారు. వైకాపా నేతల మెప్పు కోసం తప్పుడు కేసులు బనాయిస్తూ, మహిళలని చూడకుండా వేధిస్తున్న ప్రతీ ఒక్కరూ చట్టం ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉంది. కళ్యాణి గారికి టిడిపి అండగా ఉంది, మీకెవరు మద్దతు వస్తారో చూస్తాం” అంటూ పోలీసులపై నిప్పులు చెరిగారు. అలానే పాదయాత్రలో భాగంగా యాదవ సామాజికవర్గ ప్రతినిధులను కలసిన లోకేశ్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ లోకేశ్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మరి.. 66వ రోజు శింగనమలలో లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.