తెలంగాణలో టీఆర్‌ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం జరిగిన వార్తలు చదివాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ కోవకు చెందిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఆ వివరాలు..
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. అచ్చెన్నాయుడిపై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం పలాస నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ కార్యకర్త వెంకటరావు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసే ఈ హత్య చేయించాడని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వీటిపై దువ్వాడ మండిపడ్డారు. వెంకటరావుని అచ్చెన్నాయుడే హత్య చేయించి.. ఆత్యహత్యగా చిత్రీకరించి ఆ నెపాన్ని తనపై నెడుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. వెంకటరావు మరణం ధ్రువీకరణ కాక ముందే.. అతని కుటుంబ సభ్యులను ఎలా పరామర్శిస్తారని ప్రశ్నించారు. ఆ వెంటనే వెంకటరావు ఆత్మహత్యకు తానే కారణమని అచ్చెన్నాయుడు, చంద్రబాబు, లోకేష్‌లు ఆరోపిస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: టీడీపీలో మారిన అచ్చెన్నాయుడు తీరు! చంద్రబాబు దగ్గరికి రిపోర్ట్!అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు సొంత పంచాయతీ నిమ్మాడలో సర్పంచిగా ఎవరు పోటీ చేసేందుకు ముందుకొచ్చినా వారిని కింజరాపు సోదరులు హత్య చేయిస్తారని ఆరోపించారు. ఇప్పటికే నిమ్మాడలో ఏడుగురిని హత్య చేయించిన రక్తచరిత్ర అచ్చెన్నాయుడు కుటుంబానికి ఉందన్నారు. ఏడాదిన్నర క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో పోటీ చేసేందుకు ముందుకొచ్చిన కింజరాపు అప్పన్నకు తాను మద్దతుగా నిలిచి.. నామినేషన్ వేయించానని చెప్పారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేని అచ్చెన్నాయుడు ఏడాదిగా తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు.
చనిపోవడానికి ముందు వెంకటరావు కింజరాపు అప్పన్నకు కాల్ చేసి.. అచ్చెన్నాయుడికి నువ్వు సమీప బంధువు అవుతారు.. అలాంటిది దువ్వాడను నమ్మి అచ్చెన్నాయుడుకి పోటీతా ఎలా నిలబడతావ్.. ఏలాగు ఏడాదిలోగా దువ్వాడను చంపేస్తాం.. అప్పుడు నిన్నెవరు రక్షిస్తారు అని బెదిరించాడని దువ్వాడ శ్రీనివాస్ తెలిపాడు. ఈ బెదిరింపులతో ఆందోళన చెందిన అప్పన్న టెక్కలి పోలీసు స్టేషన్‌లో వెంకటరావుపై ఫిర్యాదు చేశారన్నారు. విచారణలో భాగంగా టెక్కలి పోలీసులు.. మందస పోలీసులతో కలిసి పొత్తంగి గ్రామంలోని వెంకటరావు ఇంటికి వెళ్లారని.. ఆ సమయంలో అతను ఇంట్లో లేరని.. వస్తే టెక్కలి పోలీసు స్టేషన్‌కు రావాలని చెప్పాలని ఆయన భార్యకు పోలీసులు చెప్పి వచ్చారన్నారు. వెంకటరావును పోలీసులు బెదిరించలేదన్నారు.
ఇది కూడా చదవండి: తారక్ కోసం తగ్గిన చంద్రబాబు! టీడీపీ మహానాడుకి జూనియర్ యన్టీఆర్!ఈ కుట్రకు ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే వెంకటరావును అచ్చెన్నాయుడే హత్య చేయించి.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి.. ఆ నెపాన్ని తనపై వేస్తున్నారని ఆరోపించారు. వెంకటరావును హత్య చేయించింది అచ్చెన్నాయుడేనని.. ఆ కోణంలో దర్యాప్తు చేయాలని పోలీసుల్ని దువ్వాడ శ్రీనివాస్ కోరారు. దర్యాప్తులో అచ్చెన్నాయుడు కుట్ర బట్టబయలు కావడం ఖాయమన్నారు. హత్యలు, కుట్రలతో రాజకీయాలు చేసే అచ్చెన్నాయుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.