సాధారణంగా జనాలంటే పోలీసులకు చిన్న చూపు ఉంటుంది.. చాలా అమర్యాదగా ప్రవర్తిస్తారు అనే భావం సమాజంలో వేళ్లూనుకునిపోయింది. జనాలు పోలీసులను అవమానిస్తే.. వారిపై రాజకీయ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. అవమానిస్తుంటారు. గత కొన్ని రోజులుగా ఏపీలో ఇలాంటి దృశ్యాలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. అధికార పార్టీ నేతలు పోలీస్ స్టేషన్లకు వచ్చి.. సిబ్బందిని బూతులు తిడుతూ అవమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నందిగం సురేష్ తన అనుచరుల కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. సిబ్బందిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో వైసీపీ నేత చేరారు. పోలీసులను బూతులు తిడుతూ వీరంగం ఆడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
కృష్ణాజిల్లా ఉయ్యూరు టౌన్ పోలీసులపై ఎమ్మెల్యే పార్థసారధి రెచ్చిపోయారు. స్థానికంగా టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల వివాదం విషయంలో.. పట్టణ ఎస్ఐ, ఏఎస్ఐలపై పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఏఎస్సైని విజయవాడ సిటీ కమిషనరేట్ పరిధిలో ఉంచొద్దని.. చర్యలు తీసుకోకపోతే హోంమినిస్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. గొడవపడితే స్టేషన్లో కొడతారా అంటూ ప్రశ్నించారు. ఉయ్యూరు పట్టణ ఎస్ ఐ పై కేసు పెట్టాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అవసరమైతే కోర్టులో కేసు వేయమని సూచించారు. టౌన్ పోలీసులు బ్రోకర్ల అంటూ ప్రారంభించి.. బూతులు తిట్టారు. ప్రసుత్తం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేస్తున్నారు నెటిజనులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.