వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మక జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ మెగా సర్వే పూర్తి వివరాలను పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు. నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలానే తాము అందించిన పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. “గడప గడపకు మన ప్రభుత్వం” పేరుతో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లారు. అలానే కొన్ని రోజుల క్రితం ‘జగనన్నే మా భవిష్యత్తు’ అనే పీపుల్స్ మెగా సర్వేను ప్రారంభించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఈ సర్వే ముగింపు సమావేశం జరిగింది.
వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మక జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలను కలిసి సీఎం జగనన్న పాలనపై వారి అభిప్రాయాలను సేకరించింది. సీఎం జగనన్న పాలనకు 1.1 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్ ద్వారా మద్దతు ప్రకటించారు. ఈ మెగా సర్వే పూర్తి వివరాలను పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. జగన మోహన్ రెడ్డి పాలనను సమర్ధిస్తూ 1.10 కోట్ల మిస్డ్ కాల్స్ వచ్చాయని అన్నారు. 80 శాతం మంది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపారని, ఆయనకు ప్రజలంతా జేజేలు పలుకుతున్నారని రాజశేఖర్ అన్నారు. అలానే చంద్రబాబు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని, పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నామని ఆయన అన్నారు.
అలానే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. “ఏపీలో ఏ రాజకీయ పార్టీ ఇలాంటి కార్యక్రమం చేయలేదు. మెగా సర్వేతో ప్రజా మద్దత్తు వైఎస్సార్ సీపీకే ఉందని స్పష్టం అయ్యింది. చంద్రబాబు ఇలాంటి సర్వే జీవితంలో ఎప్పుడైనా చేశారా?. సీఎం జగన్ చేస్తున్న మంచికి ప్రజల్లో ఆమోదం, సంతృప్తి ఉంది” అని విష్ణు వివరించారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి.. ఈ సర్వేపై ప్రజల నుంచి వచ్చిన స్పందనను వివరించారు.”ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ఈ కార్యక్రమంతో చరిత్ర సృష్టించింది. సర్వే ప్రారంభంలో మా అధినేత సీఎం జగన్ తన విజన్ ని నే పూర్తిగా వివరించడంతో దానికి తగినట్లుగా పనిచేశాము. మొత్తం ఆరు లెవల్స్ లో ఈ మెగా సర్వే పూర్తి చేశాం.” అని అయోధ్య రామిరెడ్డి అన్నారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలంతా జగనన్నే మా భవిష్యత్ అంటున్నారు. చంద్రబాబు కనీసం సర్వే చేయాలని ఆలోచన కూడ చేయలేదు. కుల, మతాలకు అతీతంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారు. అందుకే ప్రజల నుంచి ఈ స్థాయిలో మద్దుతు వచ్చింది” అని శ్రీనివాస్ అన్నారు. ప్రజలంతా సీఎం జగన్ పాలనపై హర్షం వ్యక్తం చేశారని, ప్రజా మద్దతు పుస్తకంలో తమ అభిప్రాయాలను వెల్లడించారని విజయవాడ తూర్పు నియోజవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. చంద్రబాబులా గాలిలో లెక్కలు చెప్పడం లేదని ఆయన అన్నారు. మరి.. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.