ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ కోసం కారు కావాలంటూ.. తిరుమల దర్శనానికి బయలుదేరిన వారిని.. ఒంగోలులో ఓ కానిస్టేబుల్ అడ్డుకుని.. వారి కారుని బలవంతంగా తీసుకెళ్లిన ఘటన వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సంఘటనపై సీఎం జగన్ స్పందించారు. తిరుమల వెళ్లే వారి వాహనాన్ని లాక్కోవడం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాన్వాయ్ కోసం వాహనాల బలవంతపు స్వాధీనంపై విచారణ జరపాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: జగన్ మోహన్ రెడ్డికి బాలినేని రిటర్న్ గిఫ్ట్!
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన శ్రీనివాస్ కుటుంబం బుధవారం తిరుమల బయలుదేరింది. రాత్రి పదిగంటల ప్రాంతంలో టిఫిన్ చేయడానికి ఒంగోలు స్థానిక పాత మార్కెట్ సెంటరులో ఆగారు. ఈ క్రమంలో వారి వద్దకు ఓ ఆర్టీఏ కానిస్టేబుల్ వచ్చి.. ఈ నెల 22 సీఎం జగన్ ఒంగోలు పర్యటన ఉంది. సీఎం కాన్వాయ్‌కు కారు కావాలని, డ్రైవర్‌ని కూడా పంపించాలని డిమాండ్ చేశాడు. అందుకు శ్రీనివాస్ తాము తిరుమల వెళ్తున్నామని.. కారు, డ్రైవర్‌ని తీసుకుని వెళ్తే.. తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. అయినా సరే సదరు కానిస్టేబుల్ వారి మాటలు వినకుండా.. కారును దానితో పాటు డ్రైవర్‌ని తీసుకుని.. శ్రీనివాస్ కుటుంబాన్ని రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్లాడు. ఈ సంఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో సీఎం జగన్ స్పందించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సీఎం జగన్ దేవుడి లక్షణాలున్న వ్యక్తి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి