టీడీపీ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు బుధవారం.. నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తోపులాట, తొక్కిసలాట కారణంగా.. 8 మంది మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా కందుకూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలానే ప్రమాదంలో గాయపడిన వారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ఈ సంఘటన దురదృష్టకరం అని.. తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి కేంద్రం తరఫున 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.
జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు బుధవారం నెల్లూరు జిల్లా.. కందుకూరు.. ఎన్టీఆర్ సర్కిల్‌లో సభ నిర్వహించారు. రోడ్డు వైశాల్యం తక్కువగా ఉండటం.. అక్కడే టూవీలర్స్ పార్క్ చేయడం,ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో.. మరింత కుంచించుకపోయింది. ఇరుకు సందులో జనాలు భారీగా చేరడమే కాక.. చంద్రబాబును దగ్గర చూడటం కోసం ముందుకు తోసుకురావడంతో.. ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కందుకూరు పోలీస్ స్టేషన్‌లో సేక్షన్ 174 కింద కేసు నమోదు అయ్యింది.