YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రానైట్ పరిశ్రమల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం మరో ఎన్నికల వాగ్ధానాన్ని అమలు చేశారు. రాష్ట్రంలోని చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమలకు గుడ్ న్యూస్ చెప్పారు. చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమలకు సంబంధించి విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు 2 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమలను ప్రోత్సహించటానికి సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, సీఎం జగన్ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్, బూచేపల్లి సుబ్బారెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గ్రానైట్ పరిశ్రమలకు సంబంధించిన ప్రకటన చేశారు. శిథిలావస్థకు చేరిన ఒంగోలు జెడ్పీ కార్యాలయ పునర్నిర్మాణం కోసం రూ. 20 కోట్లు మంజూరు చేశారు. మరి, చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమల విషయంలో సీఎం జగన్ తీసుకున్న కీలక నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వాట్సాప్ మెసేజ్ లింక్‌పై క్లిక్ చేసిన ఉపాధ్యాయురాలు.. రూ.21 లక్షలు మాయం!