ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో విశాఖ రాజధాని కాబోతుందని చెప్పారు. నేను కూడా తొందర్లోనే విశాఖకు వెళ్తానని, అక్కడి నుంచే పరిపాలనా వ్యవహారాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇక దీంతో పాటు మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సదస్సు జరగనుందని, ఈ సదస్సుకు మీ అందరినీ తప్పకుండా ఆహ్వనిస్తానని సీఎం జగన్ తెలిపారు.
ఇక దీంతో పాటు పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమావేశంలో ఆయన ప్రసంగించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదిలా ఉంటే అధికార ప్రభుత్వం విశాఖ రాజాధాని కాబోతుందని ఎప్పటి నుంచో చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కేబినెట్ మంత్రులు సైతం స్వాగతిస్తున్నారు. కానీ, విశాఖ రాజధానికి మాత్రం ప్రతిపక్షపార్టీలన్నీ వ్యతిరేకిస్తుండడం విశేషం. అయితే తాజాగా విశాఖ రాజధాని అంశంపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా రాజధాని విశాఖపై సీఎం జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.