ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నిధులు విడుదల చేస్తున్నారు. తాజాగా నేడు మరోసారి నిధులు విడుదల చేశారు జగన్. ఆ వివరాలు..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. నవ రత్నాలు పేరుతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నారు. ఇక పిల్లలకు ఇచ్చే అతి పెద్ద ఆస్తి.. చదువు అని బలంగా నమ్ముతారు సీఎం జగన్. ఈ క్రమంలోనే రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. దానిలో భాగంగా నాడు-నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద, జగనన్న వసతి దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు విద్యార్థుల ఖాతాలో నగదు జమ చేశారు సీఎం జగన్.
జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేశారు సీఎం జగన్. బుధవారం అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్.. వసతి దీవెన నిధులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.912 కోట్లు జమ చేశారు. బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ పథకం కింద ఉన్నత చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో నగదు చెల్లిస్తున్నారు.
ఇక ఈ పథకం కింద ఐటీఐ చదివే స్టూడెంట్స్‌కు 10 వేల రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివేవారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నారు. నేడు విడుదల చేసే మొత్తంతో కలిపి.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగన్ సర్కార్ రూ.4,275.76 కోట్లు జమ చేసింది. గతంలో ఉన్న పెండింగ్‌లు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం.. విద్యార్థులకు అందించి మొత్తం సాయి రూ.14,223.60 కోట్లు. మరి జగన్ సర్కార్