ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్యగా వైఎస్ విజయమ్మ అందరికీ సుపరిచితమే. ఆమె కుమారుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఆమె మాజీ ఎమ్మెల్యే కూడా. కుమారుడు స్థాపించిన వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. కొన్ని కారణాలతో ఆ పదవిని వీడారు. అయితే తాజాగా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్యగా వైఎస్ విజయమ్మ అందరికీ సుపరిచితమే. ఆమె కుమారుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అయితే ఆమె మాజీ ఎమ్మెల్యే కూడా. భర్త మరణాంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. పులివెందుల నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కొన్ని విబేధాల కారణంగా పార్టీ నుండి తల్లి, కుమారులు బయటకు వచ్చేశారు. కొడుకు స్థాపించిన వైసీపీలో చేరి.. అదే పులివెందుల నుండి మరిది వైఎస్ వివేకానంద రెడ్డిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆమె విజయంతో మొదలైన ఆ పార్టీ ప్రస్థానం..నేడు 151 ఎమ్మెల్యేలతో అధికారాన్ని చేపట్టింది. మొదటి నుంచి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. గత ఏడాది ఆ పదవి నుండి తప్పుకున్నారు. కుమార్తె షర్మిల కోసం తోడుగా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
అయితే ఆమె ఆకస్మాత్తుగా ఆ పదవిని వీడటంపై పలు రూమర్లు షికార్లు చేశాయి. కుమారుడితో విబేధాలు వచ్చాయని, తన మాటకు గౌరవం ఉండకపోవడంతోనే ఆమె పార్టీ నుండి వీడారన్న పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత కుమారుడు, తల్లి కూడా ఎక్కడా కలిసి కనిపించలేదు, అలాగే ఒకరి గురించి ఒకరు ప్రస్తావించినట్లు దాఖలాలు లేవు. అయితే వీటిన్నింటినీ పటాపంచలు చేస్తూ.. అందరికీ షాక్‌కు గురి చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విజయమ్మ జన్మదినోత్సం సందర్భంగా.. ఆయన తన మాతృమూర్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తన ట్విటర్ ద్వారా ఆయన హ్యాపీ బర్త్ డే అమ్మ అంటూ ఓ ట్వీట్ చేశారు. తల్లిని ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోను సీఎం జగన్ పోస్ట్ చేశారు.
Happy Birthday Amma! pic.twitter.com/4VYU6vwDxB
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2023