ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కురిసిన భారీ వర్షాలకు పిడుగు పాటుకు గురై ఓ యువతి మృతి చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తున్నాయి. దాంతో చేతికి వచ్చిన పంట నీటి పాలు అవుతోంది. ఇక వాతావరణ శాఖ మరో రెండు రోజులు వర్షాలు ఉన్నాయంటూ తాజాగా జారీ చేసిన హెచ్చరిక ప్రజలను షాక్ కు గురిచేసింది. ఇక ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కురిసిన భారీ వర్షాలకు పిడుగు పాటుకు గురై ఓ యువతి మృతి చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట నష్టపోయి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ప్రాణ హాని కూడా జరిగింది. తాజాగా ఏపీ లోని పార్వతీపురం మన్యం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా పిడుగు పాటుకు గురై మౌనిక(18) అనే యువతి మృతి చెందింది. మరో యువతికి గాయాలు అయ్యాయి. వీరిద్దరు బహిర్బూమికి వెళ్లి వస్తుండగా పిడుగు పాటుకు గురైయ్యారు. మౌనిక పార్వతీపురం మండలం, వెంకం పేట గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. మౌనిక స్థానికంగా ఉన్న ఓ ప్రవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. గాయపడిన మరో యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.