70 ఏళ్లు పైబడ్డ వ్యక్తి అంటే.. రకరకాల అనారోగ్య సమస్యలతో.. జీవితం మీద నిరాసక్తితో.. ఏదో ఉన్నామంటే ఉన్నాం. ఒంట్లో శక్తి సన్నగిల్లి.. ఇతరుల మీద ఆధారపడే వయసు. అయితే అందరి విషయంలో ఇలా జరగదు. ఏడు పదుల వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడిలా జోరుగా దూసుకుపోయేవారు ఉంటారు. ఆ జాబితాలో ముందు వరుసలో ఉంటారు చంద్రబాబు నాయుడు.
రాజకీయాలు, సినిమా రంగాల్లో రాణించేవారికి రిటైర్‌మెంట్ అంటూ ఉండదు. ఒంట్లో ఉత్సాహం, శక్తి ఉన్నన్నాళ్లు ఆయా రంగాల్లో రాణించవచ్చు. కావాల్సిందల్లా ఒక్కటే.. చేసే పని మీద ఇష్టం ఉండాలి. ప్రతి రోజు ఓ సరికొత్త అవకాశం.. కొత్త అంశాలు నేర్చుకోవడానికి మరో రోజు దొరికింది అని సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. అప్పుడే జీవితం కలర్‌ఫుల్‌గా.. ఫుల్ హ్యాపీగా సాగుతుంది. వయసుపైబడినా సరే.. మనసు మాత్రం కుర్రతనంతో పరుగులు తీస్తుంది. వయసు శరీరానికికే కానీ.. మనసుకు కాదు అంటూ ఉత్సహాంగా దూసుకుపోయే వారు మన చుట్టూ ఎందరో ఉన్నారు. ఆ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉంటారు. ఏడు పదుల వయసులో కూడా కుర్రాళ్లకు ధీటుగా ఉత్సాహంగా పని చేస్తారు. ఆయన ఎనర్జీని అందుకోవడానికి మిగతావాళ్లు శ్రమించాల్సి వస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఏకధటిగా తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా.. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిని ఏపీకి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు చంద్రబాబు నాయుడు. 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. పాలిటిక్స్‌లో చంద్రబాబుది సుదీర్ఘ అనుభవం. చాలా రంగాల్లో 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఉంటుంది. పదవీ విరమణ తర్వాత చాలా మంది ఉరుకుల పరుగులు జీవితం నుంచి స్వేచ్ఛ లభించింది అని భావించి.. ఇక జీవితంలో సేదదీరాలి అనుకుంటారు. ఇన్నాళ్లు ఉద్యోగ బాధ్యతలతో బిజీగా గడిపాము.. ఇక మిగిలిన సమయం రెస్ట్ తీసుకోవాలని భావిస్తారు. అయితే రిటైర్మెంట్ లేని రంగాలు కొన్ని ఉంటాయి. అవి రాజకీయాలు, సినిమాలు.
రాజకీయాల్లో 50 ఏళ్ల పైబడిన వారే అధికంగా కనిపిస్తారు. వారిలో చాలా మంది పదవులు కోసం, పార్టీ టికెట్లు ఆశించి ఉండే వారే అధికం. స్వలాభం తప్ప పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచించేవారు చాలా తక్కువ. కానీ చంద్రబాబు నాయుడు వారికి భిన్నం. ఆయన టీడీపీ పార్టీ అధ్యక్షుడు. ఆ పార్టీ యోగక్షేమాల బాధ్యత పూర్తిగా ఆయనదే. పార్టీని ముందుకు నడిపించే బాధ్యత కూడా ఆయన మీదే ఎక్కువగా ఉంటుంది. ఓ వయసు వచ్చే వరకు ఈ బాధ్యతలు నిర్వహించడం కష్టం కాదు. కానీ 7 పదుల వయసులో యువ నేతలకు ధీటుగా ఉత్సాహంగా పని చేస్తున్నారు చంద్రబాబు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ తన ప్రభావం పూర్తిగా కోల్పోయింది. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురవ్వడంతో.. పార్టీ కేడర్ పూర్తి నిరాశలో ముగినిపోయింది.
ఇలాంటి సమయంలో పార్టీని బలోపేతం చేయడం కోసం.. నిరాశలో కూరుకుపోయిన కేడర్‌కి నమ్మకం కలిగించి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పాదయాత్రలు, బస్సు యాత్రలు నిర్వహిస్తూ.. కేడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో ఎందరు నేతలున్నా సరే.. అధ్యక్షుడిగా తానే ముందుండి అన్ని కార్యక్రామాలు స్వయంగా చూసుకుంటున్నారు. గంటల తరబడి ప్రయాణాలు చేస్తూ.. బహిరంగ సభల్లో సుదీర్ఘ ప్రసంగాలు చేస్తూ.. ప్రజా సమస్యలపై తన గళం వినిపిస్తూ.. కార్యకర్తల్లో నమ్మకాన్ని నింపుతున్నారు.
అసలు వయసు అనేది తన దృష్టిలో కేవలం ఓ నంబర్ మాత్రమే అని.. మనసు యవ్వనంగా ఉంటే వృద్ధాప్యం దరి చేరదని.. నిరూపిస్తున్నారు చంద్రబాబు. ఈ వయసులో కూడా కుర్రాళ్లకు ధీటుగా ముందుకు సాగుతూ.. తన ఎనర్జీ లెవల్స్‌తో ఔరా అనిపిస్తున్నారు. చంద్రబాబుకు వయసైపోయింది.. ఆయన పని అయిపోయింది అన్నవారికి సరికొత్త సవాళ్లు విసూరుతూ.. ప్రజా క్షేత్రంలో ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ఆయనను ఢీకొట్టడం పాతికేళ్ల కుర్రాళ్ల వల్ల కూడా కాదు.. అంత ఎనర్జీటిక్‌గా ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ఆరోగ్యకరమైన ఆహారం.. క్రమం తప్పక వ్యాయామం చేస్తూ.. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే.. తనలా నిత్య యవ్వనంగా ఉండవచ్చు అనే దానికి ఉదాహరణగా నిలుస్తున్నారు చంద్రబాబు.