ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల విషయంపై రచ్చ నడుస్తోంది. మూడు రాజధానులు కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటుంటే.. ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంలో కుట్ర చేస్తున్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలు ఏం కోరుకుంటున్నారో తేల్చేద్దామని వైసీపీ ప్రభుత్వం విశాఖ గర్జన పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానులకు మద్దతుగా ఈ నెల 15న విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇక ఈ గర్జనలో అన్ని వర్గాలు పాల్గొంటాయని, అన్ని ప్రాంతాల ప్రజలు మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ రావడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు. అంతేకాదు పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ఉద్యమంలో అందరూ పాల్గొనాలని మంత్రి అమర్నాథ్ పిలుపునిచ్చారు.
దీంతో మూడు రాజధానులు వర్సెస్ అమరావతి రగడ నడుస్తోంది. ఒక పక్క తాము అమరావతిని రాజధానిగానే ఉంచుతామని వైసీపీ చెబుతున్నా గానీ ప్రతిపక్షాలు మాత్రం రాజకీయం చేస్తున్నాయని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ రగడ ఇలా జరుగుతున్న క్రమంలో.. అనకాపల్లికి చెందిన ఒక వ్యక్తి రాజధాని కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇదే బైక్ ర్యాలీలో చోడవరం నియోజకవర్గానికి చెందిన ఒక యువకుడు కూడా పాల్గొన్నాడు.
అందరూ జై విశాఖ.. జై జై విశాఖ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ యువకుడు కూడా అందరిలానే నినాదాలు చేస్తూ.. ఒక్కసారిగా తన బైక్ కి నిప్పు అంటించాడు. అనంతరం అతను కూడా నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో వెంటనే అప్రత్తమైన పోలీసులు యువకుడ్ని అడ్డుకున్నారు. దీంతో యువకుడు ప్రాణాలతో బయట పడ్డాడు. విశాఖపట్నం రాజధానిగా ఉండాలనే తాను ఆత్మాహుతిదాడి చేసుకునేందుకు ప్రయత్నం చేశానని యువకుడు అన్నాడు.
చోడవరంలో ఉద్రిక్తత… విశాఖ రాజధాని కోసం నడిరోడ్డుపై యువకుడి ఆత్మహత్యాయత్నం #APCapital #ThreeCapitals #AndhraPradesh
https://t.co/Q35e3BYSFc— Asianetnews Telugu (@AsianetNewsTL) October 13, 2022