నగరి ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆటతో అదరగొట్టారు. ఇప్పటి వరకు ఆమెలోని నటన, రాజకీయంగా ఎలా ఉంటారన్న విషయం అందరికీ తెలుసు. తాజాగా ఆమె తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఎప్పుడూ రాజకీయాలు, టీవీ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కబడ్డీ ఆడుతూ సందడి చేశారు.
విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి.. వారందర్నీ ఉత్సాహపరిచారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ తో ఆధ్వర్యంలో నగరి డిగ్రీ కళాశాలలో స్పోర్ట్స్ మీట్ ని ఆమె ప్రారంభించారు. తర్వాత భర్త సెల్వ మణితో కలిసి ఆమె కాసేపు కబడ్డీ ఆడుతూ అక్కడు ఉన్నవారందరినీ ఆశ్చర్యపరిచారు. భార్యా భర్తలు వేరు వేరు టీమ్స్ లో ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నారు.
రోజా ఆట చూసి స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు. చాలా బాగా ఆడారంటూ ప్రశంసలు కురిపించారు. ఈ రోజు నుంచి 15 వరకు ఈ కబడ్డీ పోటీలు జరుగుతాయి. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి పోటీలు తప్పకుండా అవసరం అని అన్నారు.