దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న.. అవగాహన కల్పించిన ఏ మాత్రం తగ్గడం లేదు. డ్రైవర్లు నిద్రమత్తు, మద్యం సేవించి అతి వేగంగా వాహనాలు నడపడం లాంటివి చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారులు అంటున్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీకి చెందిన ఎంపీపీ ప్రసన్న లక్ష్మి మృతి చెందారు.
కృష్ణా జిల్లా ఉంగుటూరు కి చెందిన ప్రసన్నలక్ష్మి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికై ఉంగుటూరు ఎంపీపీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నిన్న ఉదయం బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం ఇక ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె పాల్గొనేందుకు భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో రోడ్డు పై ఒక గుంతని గమనించకుండా వెళ్లి అందులో పడిపోయారు. వెంటనే వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రసన్నలక్ష్మీ బుధవారం ఉదయం మృతి చెందారు.