ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవు. ఏపీలో అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య నిత్యం వాడివేడిగా మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం ప్రచ్ఛన్నయుద్ధాన్ని తలపిస్తుంది. జనసేన పార్టీ సైతం ప్రభుత్వం పై మాటల దాడి పెంచింది. ఇరుపార్టీల నాయకులు ఒకరిపై మరొకరు ప్రత్యక్షంగా, పరోక్షంగా సెటైర్లు వేసుకుంటారు. టీడీపీ, జనసేన పార్టీలు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, ఇతర ముఖ్యనేతలపై సెటైర్లు వేస్తుంటే.. వైసీపీ నాయకులు సైతం టీడీపీ, జనసేనలపై ఓ రేంజ్ విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలో ఆటో రజిని సినిమాలో భాగంగా బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ పవన్ కల్యాణ్ పై పరోక్ష కామెంట్ల్ చేశాడు. “మీకు ఓ కథ చెప్పానా రా!.. ఓ రైలు గంటకు 150 స్పీడ్ మీద దూసుకొస్తుంది. అదే పట్టలాపై ఓ పావలా బిళ్ళ అదిరదిరిపడుతుంది.
ఆ ట్రైన్ వచ్చిన తరువాత ఆ పావల పరిస్థితి ఏమిటి రా? ఆ రైలు మా అన్నరా.. పట్టాలు ఎవరో తెలుసా? మేము. ఇక ఆ పావల బిళ్ళ మీరు.. మీ బఫూన్స్ రా ” అంటూ ఓ సెటైరికల్ డైలాగ్ చెప్పాడు. అయితే సినిమా విషయానికి వస్తే.. యువ నటుడు జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆటో రజని. ఈ సినిమాను జేఎస్‌ఆర్ మూవీస్ పతాకంపై బి.లింగుస్వామి సమర్పణలో జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుందని చిత్రయూనిట్ వెల్లడించారు. అయితే నందిగాం సురేష్ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుత ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) June 16, 2022