శ్రీరామనవమి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అలవాటు ఉంది. ఈ క్రమంలో ప్రొద్దుటూరులో ఎడ్ల పందాల నిర్వహణ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. పోటీల నిర్వహణకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే కిందపడిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: సినిమాల్లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. ఫోటోలు వైరల్!
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎడ్ల పందాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లెలో శ్రీరామనవమి సందర్భంగా ఎడ్లతో బండ్ల లాగుడు పోటీలను ప్రారంభించేందుకు అతిథిగా వచ్చారు. పోటీలు ప్రారంభించేందుకు వచ్చిన ఆయన.. దానిలో భాగంగా లాగుడు బండపై నిలబడ్డారు. పోటీలు ప్రారంభించే క్రమంలో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఎడ్లను అదిలించారు.
ఇది కూడా చదవండి: సహాయక చర్యల్లో అపశృతి.. హెలికాఫ్టర్ నుంచి జారిపడి యువకుడు మృతి!ఎడ్లు ముందుకు కదలడంతో రాయిపై నిలబడి ఉన్న ఎమ్మెల్యే పట్టు కోల్పోయి ఒక్కసారిగా కింద పడ్డారు. ఎమ్మెల్యే కిందపడిపోవడంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది, స్థానికులు ఆయనను పైకి లేపారు. ఇక ఈ ఘటనలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయం అయ్యిందని.. ఎలాంటి ప్రమాదం లేదని.. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యే పోటీలు ప్రారంభించడం, కిందపడిపోవడం అక్కడే ఉన్న ఎవరో మొబైల్‌లో రికార్డ్ చేశారు. దాంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.