సినిమా టికెట్స్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి ఉన్న ప్రత్యేక పరిస్థితిలు అందరికి తెలిసినవే. సామాన్యులపై టికెట్ భారం తగ్గించాలి అన్నది ప్రభుత్వ ఆలోచన అయితే.., ఈ రేట్లు సినిమాని చంపేస్తాయన్నది సినిమా వారి బాధ. ఈ సమస్యకి మధ్య మార్గం నిర్ణయించడానికి ఇప్పటికే కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే.. ఈలోపు కొంతమంది చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు అసలు సమస్యని పక్క దోవ పట్టిస్తోంది. తాజాగా.. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా సినిమా రంగంపై ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అంటేనే వివాదాలకు కేరాఫ్ అన్న పేరు ఉంది. సొంత పార్టీ నాయకులపై కూడా ఆయన వ్యతిరేక కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ.., ఇప్పుడు ప్రసన్నకుమార్ రెడ్డి సినీ రంగం ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది చదవండి : 20 లక్షల ఏళ్లుగా అక్కడ వాన జాడే లేదు
“టికెట్స్ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా పెద్ద సినిమాలు చూడొచ్చని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో తప్పు ఏముంది? సినిమా టికెట్స్ ని రూ.1000, రూ.2000 అముకోవడం ఎంత వరకు కరెక్ట్? సినిమా వాళ్ళు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. అసలు వీరందరికీ ఆంధ్రప్రదేశ్ గుర్తుందా?” అంటూ.. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.