బుధవారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు. ఈనేపథ్యంలో మార్కాపురంలోని ఎస్వీకేపీ కళశాల ప్రాంగణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం జగన్ కి ఘన స్వాగతం పలికారు. అయితే ఈ పర్యటనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
బుధవారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు. ఈనేపథ్యంలో మార్కాపురంలోని ఎస్వీకేపీ కళశాల ప్రాంగణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా నేతలు అందరూ సీఎం జగన్ కి స్వాగతం పలికేందుకు సీఎం హెలీపాడ్ వద్దకు చేరుకున్నారు. అలానే సీఎం జగన్ కి పశ్చిమ ప్రకాశం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అయితే మార్కాపురంలో సీఎం జగన్ చేస్తున్న పర్యటనలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసు రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం పర్యటనలో మాజీ మంత్రి బాలినేని తీవ్ర అసహనానికి గురయ్యారు. సీఎంకు స్వాగతం పలికేందుకు హెలీపాడ్ దగ్గరకు వాహనంలో వెళ్లకుండా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం దిగి నడిచి వెళ్లాలని పోలీసులు చెప్పడంతో బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అసహనానికి గురైన బాలినేనికి మంత్రి ఆదిమూలపు సురేష్ సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కోపంతో బాలినేని శ్రీనివాసు రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అలా పోలీసుల తీరుపై మాజీ మంత్రి బాలినేని అసహనం వ్యక్తం చేశారు.
సీఎం సభకుడు వెళ్లకుండానే బాలినేని అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. చాలా సమయం పాటు సీఎం సభకు కూడా బాలినేని హాజరు కాలేదు. బాలినేని సభకు రాకుండా వెళ్లిపోవడంతో సీఎం జగన్ ఆరా తీశారని తెలుస్తోంది. దీంతో సీఎంవో నుంచి బాలినేని శ్రీనివాస రెడ్డికి ఫోన్ వెళ్లిందని సమాచారం. సీఎంవో నుంచి ఫోన్ కాల్ రావడంతో బాలినేని తిరిగి సీఎం సభకు హాజరయ్యారు. గతంలో కూడా తనకు మంత్రి పదవిని తొలగించిన సందర్భంగాలో బాలినేని తీవ్ర అసహనానికి లోనయ్యారు. తనతో పాటు మంత్రిగా ఉన్న వ్యక్తికి తిరిగి మంత్రి వర్గంలో చోటు కల్పిచడం కూడా ఆ అసహనానికి ప్రధాన కారణమని కొందరు అభిప్రాయపడ్డారు.
అయితే బాలినేని విషయం సీరియస్ గా తీసుకున్న అధిష్టానం ఆయను బుజ్జగించే ప్రయత్నం చేసింది. చివరకు శాంతించిన బాలినేని తిరిగి పార్టీ కార్యకలాపాల్లో యాక్టీవ్ అయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ మోహన్ రెడ్డి వెంటే నడిచిన అతితక్కువ మందిలో బాలినేని ఒక్కరు. తాజాగా మార్కాపురం పర్యటనలో బాలినేనికి ఎదురైన చేదు అనుభవంపై కూడా సీఎంవో కార్యాలయం స్పందించింది. దీనిబట్టి ఆయనకు పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి.. సీఎం పర్యటనలో బాలినేనికి ఎదురైన చేదు అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.