తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి చేశారు. విజయవాడలోని ఆయన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు సామగ్రి ధ్వంసం చేశారు. ఈ రోజు ఉదయం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు పోలీసులు నోటీసులు అందించడంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళవారం ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
జగన్ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. ఏపీ గంజాయికి అడ్డాగా మారిందని.. అలాంటి పరిస్థితి లేకుంటే తెలంగాణ , తమిళనాడు పోలీసులు గంజాయి స్మగ్లర్లని పట్టుకోవడానికి ఏపీకి ఎందుకు వచ్చారని పట్టాభి ప్రశ్నించారు. ఆనంద్ బాబుకు నోటీసులివ్వడంలోచూపిన మెరుపువేగం, గంజాయిసాగుని అరికట్టడంలో చూపితే బాగుండేదంటూ పోలీసులపై కొమ్మారెడ్డి పట్టాభి ఫైర్ అయ్యారు. అయితే పట్టాభి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. సీఎంకు వ్యతిరేకంగా పట్టాభి వ్యాఖ్యల్ని నిరసిస్తూ టీడీపీ కార్యాలయంపై దాడులు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. టీడీపీ నేత పట్టాభి నివాసంపై దాదాపు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అంతేకాదు విలువైన వస్తువులను కూడా ధ్వంసం చేశారు. దాడి సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో పట్టాభి ఉన్నారు.
విశాఖపట్నం, విజయవాడలో వైకాపా కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సమాచారం. అంతేకాదు హిందూపురంలో బాలకృష్ణ క్యాంప్ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి పర్నీచర్ ధ్వంసం చేసినట్లు సమాచారం. అంతే కాదు బాలకృష్ణ ఇంటిని కూడా వైసీపీ కార్యకర్తలు ముట్టడించినట్లు సమాచారం. మరోవైపు బాలకృష్ణ క్యాంప్, ఇంటిపై దాడులు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అసలు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు… ప్రతి విమర్శలు చేయడం సర్వసాధారణం.. దానికి ప్రత్యక్ష దాడులు జరగడంపై రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.