ఇటీవల తెలుగు రాష్ట్రంలో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. . పట్టుమని 30 ఏళ్ల వయసు కూడా లేనివారు హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. హాస్పిటల్ కి తరలించే లోపు కన్నుమూస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా వరుస గుండెపోటు మరణాలు గణనీయంగా పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు తగ్గు ముఖం పట్టిన కరోనా మళ్లీ విజృంభిస్తుంది.. ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు వరుస గుండెపోటు మరణాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. చిన్న వయసు.. పెద్ద వయసు అనే తేడా లేకుండా హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. హాస్పిటల్ కి తరలించే లోపు కన్నుమూస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో అక్కడ హార్ట్ ఎటాక్ తో కన్నుమూస్తున్న కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేత గుండెపోటుతో కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ నాగలాపురానికి చెందిన మాజీ ఎంపీపీ.. వైసీపీ మహిళా నేత కల్పన భర్త విజయ్ కుమార్.. వయసు 50 సంవత్సరాలు శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. వైసీపీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీలో ఎంతో చురుకుగా పనిచేస్తూ వచ్చిన విజయ్ కుమార్ గుండెపోటుతో పార్టీశ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ నాగలాపురంలోని మృతుడు విజయ్ కుమార్ స్వగృహానికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నాగలాపురం చేరుకొని విజయ్ కుమార్ మృతదేహానికి గజమాలతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ.. వైఎస్సాఆర్ సీపీ స్థాపించినప్పటి నుంచి విజయ్ కుమార్ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. నాగలాపురాంలో విజయ్ కుమార్ ఆయన సతీమణి కల్పన వైఎస్సార్ సీపీ పార్టీ పటిష్ట పెంచేందుకు గొప్ప కృషి చేశారని.. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారుల, వైసీపీ నేతలు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.