సాధారణంగా పోలీసులు అంటే చాలా మందిలో వ్యతిరేక అభిప్రాయం ఉంటుంది. వారు కనిపించిన, వారి సైరన్ వినిపించిన ప్రజల్లో తెలియని భయం కలుగుతుంది. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడ చూసిన ఫ్రెండ్లీ పోలీసింగ్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రజల్లో తమపై ఉన్న భయాన్ని, చెడు అభిప్రాయాలను తొలగించేందుకు పోలీసులు అనేక విన్నుత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పోలీసులు ఓ గర్భిణీ మహిళా కానిస్టేబుల్ కి సీమంతం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ వేడుక పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం పోలీస్ స్టేషన్ వేదిక అయింది. వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం పోలీస్టేషన్ లో పనిచేసే మహిళా పోలీసులు, సచివాలాయాల్లోని మహిళ పోలీసులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా మహిళ పోలీసులు కేక్ కటింగ్ చేసి వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇరగవరం పరిధిలోని ఓ సచివాలయంలో అలేఖ్య అనే మహిళ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ఆమె ప్రస్తుతం నెలల గర్భిణీ. ఉమెన్స్ డే సందర్భంగా అలేఖ్య సీమంతం నిర్వహించారు స్థానిక పోలీసులు. దీంతో ఎప్పుడూ నిశ్శబ్దంగా కనిపించే ఇరగవంర పోలీస్టేషన్ ప్రాంగణంలో ఒక్కసారిగా సందడి వాతావరణం కనిపించింది.
దీంతో అటు వెళ్లే వాళ్లంతా ఒక్కసారి ఆగి జరుగుతున్న కార్యక్రమాన్ని చూసి ఆనందం వ్యక్తంచేశారు. పోలీస్ మహిళలకు సన్మానం, సీమంత కార్యక్రమం చేయండ చూసిన స్థానికులు పోలీసులను అభినందించారు. మరి.. ఎప్పుడు విధుల్లో భాగంగా ప్రజల పట్ల కొంచెం కఠినంగా వ్యవహరించే పోలీసులు.. ఇలా సీమంత వేడుక సైతం నిర్వహించడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.