ఆంధప్రదేశ్‌లో ఎన్నికల వేడి ముందు గానే మొదలైంది. ప్రతిపక్ష పార్టీలైన జనసేన, టీడీపీలు తమదైన వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వారాహి’తో బస్సు యాత్రకు సిద్ధమాయ్యారు. మరికొన్ని నెలల్లో ప్రచార రథంతో ఏపీలో పర్యటించనున్నారు. ఇక, టీడీపీ కూడా యువ నాయకుడు నారా లోకేష్‌ను రంగంలోకి దింపింది. లోకేష్ ప్రస్తుతం ‘యువగళం’ పేరిట రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికార వైఎస్సార్ సీపీ ఆలోచనల్లో పడింది. ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు పగడ్భందీ వ్యూహాలను సిద్ధం చేస్తోందట. సీఎం జగన్‌ను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచన చేస్తోందట. వైఎస్సార్ సీపీలోని కీలక నేతలు కూడా ఇదే భావిస్తున్నారట.
ప్రభుత్వం ప్రస్తుతం ‘గడప గడపకు వైఎస్సార్ సీపీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలాగే మరో కార్యక్రమాన్ని చేపట్టడానికి చూస్తోందట. ఆ కార్యక్రమానికి ‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్న పేరు కూడా ఖరారు చేశారట. ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టుర్లను రాష్ట్రంలోని ప్రతీ గడపకు అతికించాలని భావిస్తున్నారట. ఇలా చేయటం వల్ల జనంలో పార్టీ విశ్వసనీయతకు సంబంధించిన సానుకూల పవనాలు వీచే అవకాశం ఉందని అధిష్టానం యోచిస్తోందట. జగన్ పాలనలో ప్రతీ ఇంటికి లబ్ధి చేకూరిందన్న ధీమాతోనే వైఎస్సార్ సీపీ ఈ పోస్టర్ల కార్యక్రమానికి తెర తీసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం కోసం పవన్ కల్యాణ్ ‘వారాహి’ అనే రథాన్ని సిద్ధం చేశారు. మరికొన్ని నెలల్లో యాత్రను ప్రారంభించనున్నారు. పవన్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్‌కు ఆ యాత్ర సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పటంలో ఎలాంటి డౌట్ లేదు. న్యూట్రల్‌గా ఉండే జనంలో పవన్‌కు మంచి మైలేజ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ వారాహి యాత్రకు పోటీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర చేసే యోచనలో ఉన్నారట. ప్రతీ మండలంలో ఆయన పర్యటించనున్నారట. అంతేకాదు! పల్లె నిద్రలు చేయటానికి కూడా సిద్ధం అవుతున్నారట. ప్రజల్లో అసంతృప్తిని పారద్రోలటానికి, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించటానికి ఈ వ్యూహ రచన చేసినట్లు సమచారం. ఏప్రిల్ నుంచి ఈ యాత్ర మొదలయ్యే అవకాశం ఉందట. మరి, సీఎం జగన్‌ను బస్సు యాత్ర చేపడితే ఏ మేరకు సక్సెస్ కాగలదో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.