వారిద్దరు పన్నెండేళ్లుగా ప్రేమించుకున్నారు. పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లో కొత్త కాపురం కూడా పెట్టారు. కానీ ఏడాది తిరిగే సరికి 12 ఏళ్ల ప్రేమ.. ఏడాది పెళ్లి బంధంలో వివాదాలు చోటుచేసుకున్నాయి. కట్ చేస్తే.. భర్త ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది ఆ మహిళ. కాశీబుగ్గ మున్సిపాలిటీ రెల్లి వీధిలో ఓ యువతి ఆదివారం అత్తవారి ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. అసలు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని రెల్లివీధికి చెందిన భానుతో రోటరీ నగర్ చెందిన మురళీకృష్ణంతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమ మారింది. దీంతో 12 ఏళ్లు గాఢంగా ప్రేమించుకున్నారు. 2021లో పెళ్లి చేసుకోవాలని భాను..మురళికృష్ణను కోరితే అతడు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించి.. డీఎస్పీ ఎం. శివరామిరెడ్డి, సీఐ శంకరావు సమక్షంలో 2021 జనవరి 5న మురళిని పెళ్లి చేసుకుంది.
ఇదీ చదవండి: 8 మంది పిల్లల్ని కన్న తర్వాత.. సంసారం వద్దనుకుని 57 ఏళ్ల వ్యక్తితో పరారీ!
పోలీసులు కౌన్సిలింగ్ మేరకు హైదరాబాద్ లో ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. అయితే చెప్పా పెట్టకుండా ఇంటికి తాళం వేసి కాశీబుగ్గ వెళ్లాడు. విషయం తెలుసుకున్న ఆమె అక్కడి వెళ్లింది. న్యాయం జరిగే వరకు పోరాడతానని భర్త ఇంటి ముందు బైఠాయించింది. అత్తింటి వారు ఎవరు స్పందించలేదు. కాశీబుగ్గ పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెకు రక్షణ కల్పించారు. మరి.. ఈ సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంల తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.