రెండు తెలుగు రాష్ట్రాల్లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది శోభ వెల్లివిరుస్తోంది. అలానే ఏపీ ప్రజలు ఉగాది పర్వదినాన్ని కన్నులపండువగా జరుపుకుంటున్నారు. ఉగాది రోజున అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది అనేది తెలుగువాళ్ల కొత్త సంవత్సరం కాబట్టి.. ఈ ఏడాది జాతకరీత్యా ఎలా ఉండబోతోంది? అనేది తెలుసుకోవాలి అనుకుంటారు. అలానే ఈ కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉండబోతుందో పండితులు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది శోభ వెల్లివిరుస్తోంది. అలానే ఏపీ ప్రజలు ఉగాది పర్వదినాన్ని కన్నులపండువగా జరుపుకుంటున్నారు. ఉగాది అనగానే అందరికీ ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. షడ్రుచుల ఉగాది పచ్చడిని కచ్చితంగా స్వీకరించాలి అని చెబుతారు. అలాగే ఉగాది రోజున అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది అనేది తెలుగువాళ్ల కొత్త సంవత్సరం కాబట్టి.. ఈ ఏడాది జాతకరీత్యా ఎలా ఉండబోతోంది? అనేది తెలుసుకోవాలి అనుకుంటారు. అలానే ఈ కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉండబోతుందో పండితులు తెలిపారు.
తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోని గోశాలలో ఉగాది వేడుగలు ఘనంగా జరిగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టిపడే విధంగా ఉగాది సంబరాలు జరిగాయి. ఈసందర్భంగా వ్యవసాయ పంచాంగాన్ని సీఎం జగన్ అవిష్కరించారు. ఈ వేడుకలో ప్రముఖ పండితులు కప్పగుంతు సుబ్బరామ సోమయాజి గారు పంచాంగ పఠనం చేశారు. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉండబోతుందో తెలిపారు. ఈ సంవత్సరం పంచాంగం చాలా చక్కగా నడుస్తుందని సుబ్బరామ సోమయాజి అన్నారు. చాలా గొప్ప విశేషం ఏమిటంటే సంవత్సరానికి సంబంధించిన నామము, గ్రహాలు చక్కటి యోగ్యంగా సంచారం చేయడం అనేది చాలా తక్కువగా జరుగుతుంటుందని ఆయన తెలిపారు.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయని ఆయన అన్నారు. అలానే ఉద్యోగులకు, శ్రామికులు, కర్షకులకు మంచి ఫలితాలు ఉంటాయన్నారు. పాడి పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నారు. ఆహార ఉత్పతులతో ముడిపడిన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని సుబ్బరామ సోమయాజి పండితులు తెలిపారు. ఆయన పంచాంగ పఠనంలో అనేక విషయాలు తెలిపారు. “ఈ సంవత్సరం పశుపాలకుడు బలరాముడు అయి ఉన్నారు. గోష్ట బహిష్కకర్త శ్రీకృష్టుడు అయ్యి ఉన్నారు. కాబట్టి పశువులు రోగ రహితంగా ఉంటాయి. ఆరోగ్యకరంగా ఉంటు పాలు ఇస్తుంటాయి. రాష్ట్రంలో పాడి అభివృద్ధి జరుగుతుంది.
వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. రాష్ట్ర మంతటా కూడా మంచి వాతావరణంఉంటుంది. అలానే పంటలు బాగా పండే అవకాశం ఉంది. రైతుకు, వ్యవసాయదారుడికి అన్నిరకాలుగా అనుకూలమైన స్థితి ఉంది. పర్వత ప్రాంత పంటలకు కూడా అనుకూలంగా ఉంది. వాణిజ్య పంటలు బాగా పండే అవకాశం ఉంది. అలానే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ప్రభుత్వం రైతులకు కావాల్సిన సదుపాయాలు చక్కగా కల్పిస్తుంది. ప్రభుత్వ విధానాలు రైతులకు అనుకూలంగా ఉన్నందున్న.. రైతులు ఆర్ధికంగా పుంజుకునే అవకాశం ఉంది.
అక్టోబర్ నుంచి ఆర్థికంగా బాగా పుంజుకోనున్న దృష్ట్యా పరిపాలనలో అన్ని శాఖల్లో కూడా గొప్ప మార్పులు వస్తాయి. గురువుతో సంబంధం ఉన్నటువంటి విద్యాశాఖ బాగుంటుంది. ఈశాఖ ద్వారా మనం చాలా అభివృద్ధిని చూడనున్నాము. విద్యతో ముడిపడిన అన్నిరకాల వ్యాపారాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయి. ఇలా అన్ని రకాల అభివృద్ధులతో రాష్ట్ర ప్రజలు ఈ ఏడాది గడపనున్నారు” అని సుబ్బరామసోమయాజి తెలిపారు. మరి.. ఏపీ అభివృద్ధి విషయంలో పండితులు చెప్పిన పంచాంగంపై మీ అభిప్రాాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.