సామాన్యంగానే అల్లుళ్ళు అంటే మర్యాదలెక్కువ. అందులోనూ గోదావరి జిల్లాల్లో మరీ కాస్త ఎక్కువ. అలాంటిది ఇక సంక్రాంత్రి పండగ సమయాల్లో కొత్త అల్లుళ్ళు వస్తే అత్తమామలు, బామర్ధులు, మరదలు చేసే హంగామా మాములుగా ఉండదు. అల్లుడికి రాచ మర్యాదలు చేస్తారు. పిండి వంటలు, కొత్త బట్టలు… ఇలా అత్తమామాలు చేసే హడావుడి చెప్పక్కర్లేదు. తాజాగా పశ్చిమ గోదావరిలో ఓ కుటుంబం తమ ఇంటికి కాబోయే అల్లుడికి 365 రకాల పిండివంటలతో ఆతిథ్యమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పశ్చిమ గోదావారి జిల్లాకు చెందిన అత్యం మాధవి, వెంకటేశ్వరావు కుమార్తె కుందవికి తణుకుకు చెందిన సాయికృష్ణతో వివాహం నిశ్చయమైంది. నరసాపురంలో ఉండే కుందవి తాతయ్య గోవింద్ .. కాబోయే వధూవరులను తమ ఇంటికి ఆహ్వానించారు. మనవరాలికి కాబోయే భర్తకి 365 రకాల పిండి వంటలను రుచి చూపించారు.
అన్నం, పులిహోర, బిర్యానీ, దద్దోజనం వంటి వంటకాలతో పాటు, 30 రకాల కూరలు, వివిధ రకాల పిండి వంటలు, 100 రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్థాలు,15 రకాల ఐస్ క్రీమ్స్, 35 రకాల శీతలపానీయాలు, 15 రకాల కేకులతో భోజనం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కాబోయే నూతన వధువరుల స్వీకరించిన ఈ భారీ ఆతిథ్యానికి సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.