సీతారామం' మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో సీత పాత్ర అందరిని ఆకట్టుకుంది. తాను ఓ యువరాణి అయినప్పటికి ఎంతో సామాన్య స్త్రీలా ఉండిపోయింది. అలానే ఈ సినిమాలో సీత ప్రేమ కథ ఎన్నో మలుపు తిరుగుతుంది. అందుకే ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది. అలానే జీవితంలో జరిగిన ఓ సీతకథ కూడా అందర్ని ఆకట్టుకుంది.
‘సీతారామం’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో సీత పాత్ర అందరిని ఆకట్టుకుంది. తాను ఓ యువరాణి అయినప్పటికి ఎంతో సామాన్య స్త్రీలా ఉండిపోయింది. అలానే ఈ సినిమాలో సీత ప్రేమ కథ ఎన్నో మలుపు తిరుగుతుంది. అందుకే ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది. అలానే జీవితంలో జరిగిన ఓ సీతకథ కూడా అందర్ని ఆకట్టుకుంది. అయితే అది ఈ మధ్య కాలంలో జరిగింది కాదు. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు జరిగిన ఓ సీత ప్రేమ కథ ఇది. మరి.. ఈ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పిఠాపురం రాజు రాజా వెంకట కుమార మహిపతి సూర్యారావు బహదూర్, రాణి చిన్నమాంబదేవి దంపతుల కుమార్తె పేరు సీతాదేవి. ఆమెను ఎంతో అపూరంగా పెంచి పెద్ద చేసి ఉయ్యూరు జమీందారు మేకా రంగయ్య అప్పారావు బహదూర్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారిద్దరికీ రాజా విద్యుత్ కుమార్ అప్పారావు అనే కుమారుడు జన్మించాడు. ఇలా సాగుతున్న వీరి జీవితంలో ఓ గుర్రపు పందేలా ఆట మరో మలుపు తిప్పింది. 1943లో మద్రాస్ లో జరుగుతున్న గుర్రపు పందేలను చూడటానికి సీతాదేవి వెళ్లారు. ఆ సమయంలో బరోడా రాజు ప్రతాప్ సిన్హ్ రావ్ గైక్వాడ్‌ను ఆమె కలిశారు.
దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైనా ప్రతాఫభ్ సిన్హ.. సీతా దేవి అందానికి ఫిదా అయిపోయారు. అయితే ఆమెకు పెళ్లైన విషయం తెలిసి….తన ఆలోచనలను మార్చుకున్నాడు. ఆయనకు కూడా అప్పటికే శాంతాదేవి అనే రాణితో పెళ్లయ్యింది. ఈ దంపతు లిద్దరికగి ఎనిమిది మంది పిల్లలున్నారు. ఇలాంటి తరుణంలో సీతాదేవి, ప్రతాఫ్ సిన్హా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రతాప్ సిన్హా తో ఆమె ప్రేమలో పడ్డారు. కొందరు ఇచ్చిన సలహా ప్రకారమే సీతాదేవి ఇస్లాం మతాన్ని స్వీకరించడంతో ఉయ్యూరు జమీందారుతో జరిగిన పెళ్లి రద్దయ్యింది. ఆ తరువాత తిరిగి హిందూ మతంలోకి మారి.. 1943, డిసెంబర్ 31న ప్రతాప్ సిన్హ్ గైక్వాడ్‌ను పెళ్లాడింది. వారిద్దరికీ 1945లో సాయాజీరావ్ గైక్వాడ్ జన్మించాడు.
ఈ దంపతులు ఇద్దరు పెళ్లి అనంతరం యూరప్‌లోని చాలా దేశాల్లో పర్యటించారు. సీతాదేవి చివరగా మొనాకోలో సెటిలవ్వగా.. బరోడా రాజు తరచుగా అక్కడి వెళ్తుండేవారు. వెళ్లిన పత్రిసారి ఖరీదైన బహుమతులు తీసుకెళ్లేవారు. పార్టీలు, గెట్ టుగెదర్‌లకు ఆమె విపరీతంగా డబ్బు ఖర్చు చేయడంతో ఆ భారం బరోడ ఖజానాపై పడింది. ఈ విషయంలో సీతాదేవి, ప్రతాప్ సిన్హ్ దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. 1956లో వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. మద్యానికి బానిసగా మారిన వారి కుమారుడు 1985లో చనిపోయాడు. కొడుకు మరణంతో మానసికంగా కుంగిపోయిన సీతాదేవి నాలుగేళ్ల ప్యారిస్‌లో చనిపోయారు.