Vizag Zoo: జూలోని అడవి జంతువులను ఇబ్బంది పెడుతూ వీడియో తీస్తున్న ఓ యువకుల గుంపుకు అడవి పంది చుక్కలు చూపించింది. వెంటపడి పరుగులు పెట్టించింది. ఓ యువకుడిపై దాడి కూడా చేసింది. వివరాల్లోకి వెళితే.. మారిక వలసకు చెందిన ఓ ఐదుగురు యువకులు ఓ గుంపుగా ఏర్పడ్డారు. విశాఖపట్నం జూలోని జంతువులే టార్గెట్‌గా వీడియోలు చేయటం మొదలుపెట్టారు. జూలోని జంతువుల ఎన్‌క్లోజర్‌లోకి దూరటం, జంతువులను బెదరగొట్టి వీడియోలు చేయటం చేయసాగారు.
ఇలా ఓ తాబేల్ ఎన్‌క్లోజర్‌లోకి చొరబడి దాన్ని బెదరగొట్టారు. ఆ తర్వాత ఓ అడవి పందుల ఎన్‌క్లోజర్‌లోకి దూకారు. లోపల అరుస్తూ పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో ఓ అడవి పంది వీరిపైకి దాడికి దిగింది. దీంతో యువకులు భయపడిపోయి పరుగులు తీశారు. ఓ యువకుడి వెంటపడ్డ అడవి పంది అతడిపై దాడి చేసింది. కోరలతో పొడిచి కిందపడేసింది. అనంతరం అక్కడినుంచి లోపలకు పరుగులు పెట్టింది.
అడవి పంది లోపలికి పోగానే ఎవరి దారిన వాళ్లు పైకి ఎక్కేశారు. ఆ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ వీడియో తీసి నెల రోజులు కాగా.. ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న జూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. దీనిపై జూ అధికారిని నందిని సలారియా మాట్లాడుతూ.. ‘‘ జూ లోని అడవి పంది ఎన్ క్లోజర్ లోకి ముగ్గురు యువకులు వెళ్లి దాన్ని రెచ్చ గొట్టారు.
అంతేకాదు! ఆ సమయంలో తీసిన వీడియోలను లైక్స్ కోసం సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. సరదా కోసం ప్రాణాలను పణంగా పెట్టారు. జూ ఉంది జంతువుల పై అవగాహన పెంపొదించుకోవడం కోసమే కానీ, ఇలాంటి అరాచకాలకు కాదు. ఇలాంటి నేరాలు ఎవరు పాల్పడినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. దాదాపు 6 సంవత్సరాలు శిక్ష పడుతుంది. ఇలాంటి పనుల వలన యువకుల జీవితాలు నాశనం అవుతాయి’’ అని అన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) July 30, 2022
ఇవి కూడా చదవండి : Bhuma Akhila Priya: భూమా ఇంట ఆస్తి వివాదాం.. అఖిలప్రియపై కోర్టుకెక్కిన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి!