ఒకప్పుడు వయసు పైబడిన వారు, అధిక బరువుతో బాధపడేవారు మాత్రమే గుండెపోటుకు గురయ్యేవారు. అయితే నేటి కాలంలో.. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా మరో గుండెపోటు మృతి వెలుగు చూసింది. ఆ వివరాలు..
చావు పుట్టుకలు మన చేతిలో ఉండవు అంటారు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోవాల్సిందే. అయితే నేటి కాలంలో సంభవించే మరణాలు చూస్తే.. భయంగా ఉంటుంది. అంతసేపటి వరకు ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా, రోజు వారి పనులు చేసుకుంటూ గడిపిన వారు.. ఉన్నట్లుండి కుప్పకూలి మృత్యువాత పడుతున్నారు. ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించే అవకాశం కూడా లేకుండా పోతుంది. కార్డియాక్ అరెస్ట్‌కు గురి కావడంతో.. సెక్లన వ్యవధిలోనే ప్రాణాలు విడుస్తున్నారు. అంతసేపు తమ పక్కనే ఉన్నవారు.. క్షణాల వ్యవధిలో ప్రాణాలు విడుస్తుండటం కలకలం రేపుతోంది. ఇక తాజాగా విశాఖ స్టీల ప్లాంట్‌లో గుండెపోటు మృతి ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం గుండెపోటుతో కన్నుమూశారు. పీపీఎం (ప్లాంటు ప్రొడక్షన్ మానటరింగ్) విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న తలగాన వెంకట వరప్రసాద్ గుండెపోటుతో కన్ను మూశారు. సోమవారం ఉదయం జనరల్ షిఫ్ట్‌కు వచ్చిన ప్రసాద్.. ఈడీ (వర్క్స్) ఆఫీస్ మూడో ఫ్లోర్‌లో లిఫ్ట్ దిగి తన రూమ్‌కు వెళుతుండగా ఒక్కసారిగా.. నడుస్తూనే కుప్పకూలిపోయారు. ఇది గమనించిన తోటి ఉద్యోగుల.. వెంటనే పరుగన వచ్చి.. వరప్రసాద్‌ను ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు.
ఆ తర్వాత అక్కడ నుంచి ఉక్కు జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకుండాపోయింది. అప్పటికే వర ప్రసాద్ చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. వరప్రసాద్ మృతికి ఆకస్మిక గుండెపోటు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. డీజీఎం ప్రసాద్ మరణంతో కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు తీవ్ర విషాదంలో ఉన్నారు. స్టీల్‌ప్లాంట్ పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.