ప్రస్తుతం సమాజంలో చాలా వరకు పెళ్లిళ్లు అవసరం, అవకాశం మీదనే ఆధారపడి నడుస్తున్నాయి. ఇప్పటికే చిన్న చిన్న కారణాలకే విడిపోతున్న దంపతులను చూశాం. అక్రమ సంబంధాలు పెట్టుకుని ఒకరిని ఒకరు చంపుకున్న జంటలను కూడా చూశాం. కానీ, ప్రేమించి పెళ్లిచేసుకుని ఇంత చిన్న కారణానికే భర్తను చంపేసిన మహిళను చూసుండరు.
కట్టుకున్న భర్తను కడతేరుస్తున్న భార్యలను చూస్తూనే ఉన్నాం. ఆ హత్యల వెనుక ముఖ్యంగా వినిపించే కారణం అక్రమ సంబంధం. అయితే భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడనో.. వేరే వ్యక్తితో తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడనో హత్యలు చేసిన భార్యలను చూశాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే భార్య మాత్రం సరికొత్త కారణంతో తండ్రి సాయంతో భర్తను హత్య చేసింది. అసలు అందుకు చంపుతారా? అనే ప్రశ్న కూడా రాకమానదు. ఆమె హత్య చేయడం మాత్రమే కాకుండా జైలు పాలై.. కన్నకూతురిని అనాథగా మార్చింది. ఆమె చేసిన అనాలోచిత చర్య తెలుసుకుని స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. నేరేడువలసకు చెందిన ప్రీతికి చివుకుచింత గ్రామానికి చెందన హరి విజయ్ ప్రేమించుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం వారికి కూడా వివాహం జరిగింది. వారికి ఒక కూడా ఉంది. వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వివిధ కారణాల రీత్యా ప్రీతి తండ్రి శంకర్రావు కూడా వారితోనే ఉంటూ ఉంటాడు. బతకుతెరువు కోసం హరి విజయ్ ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు. కొన్నాళ్లకు ఆ వ్యాపారంలోకి ప్రీతి కూడా అడుగుపెట్టింది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వ్యాపారాన్ని డెవలప్ చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకు వ్యాపారంలో నష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచే వారి మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. ఆ గొడవలు రాను రాను ముదురుతూ వచ్చాయి.
అయితే ప్రీతి బుర్రలో ఒక ఆలోచన మొదలైంది. భర్తను తప్పిస్తే తానే ఎంచక్కా వ్యాపారం చేసుకోవచ్చు కదా అని భావించింది. అయితే హత్య చేస్తే తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచించలేదు. తండ్రితో కలిసి భర్తను చంపేందుకు పథకం రచించింది. అనుకున్నదే తడవుగా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసింది. భర్తకు ఫుల్ గా మద్యం పట్టించింది. మద్యం మత్తులో ఉన్న భర్తను దిండుతో ఒత్తి చంపేసింది. వెంటనే పాడేరు ఆస్పత్రికి తీసుకెళ్లింది. తన భర్త గుండెపోటుతో కుప్పకూలాడని.. కోమాలోకి వెళ్లిపోయాడని చెప్పింది. పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయిచే ప్రీతి వాలకం, ఆమె ఏడుపు చూస్తే వైద్యులకు అనుమానం వచ్చింది.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం చేయించగా.. హరి విజయ్ ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. ప్రీతిని పోలీస్ స్టైల్ లో విచారించగా అసలు విషయాన్ని బయటపెట్టింది. తండ్రితో కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ కేసులో పోలీసులు ప్రీతి- శంకర్రావు కాకుండా ఇంకో ఏడుగురిని అరెస్టు చేశారు. కన్నతండ్రి మరణించడం, ఉన్న అమ్మ- తాత జైలు పాలవ్వడంతో ఆ చిన్నారి అనాథగా మారింది. ప్రీతి చేసిన అనాలోచిత చర్య వల్ల భర్త ప్రాణం పోవడం మాత్రమే కాకుండా ఏ పాపం తెలియని చిన్నారి జీవితం నాశనం అయిపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కూడా ప్రీతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన ప్రీతి- ఆమె తండ్రికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.