గత కొంత దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంబవిస్తున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఇటీవల దేశంలో పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్య సేవించి వాహనాలు నిర్లక్ష్యంగా నడపడం వల్లనే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా మందుబాబులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబులకు కోర్టు వెరైటీ శిక్ష విధించింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రోడ్లపై మద్యం సేవించి వాహనాలు నడపవొద్దని పోలీసులు ఎన్ని రకాలుగా చెబుతున్నా మందుబాబులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించినా ఫలితం మాత్రం శూన్యం. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగడం.. ఎంతో మంది అమాయకులు చనిపోవడం చూస్తూనే ఉన్నాం. మందుబాబులకు ఎలాంటి శిక్ష వేస్తే వారిలో పరివర్తన వస్తుందన్న విషయంపై విశాఖ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు వారు ఆలోచించి.. ఓ వినూత్నమైన తీర్పుని ఇచ్చింది. మూడు రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిని కోర్టు ముందు హాజరు పరిచారు పోలీసులు.
సాధారణంగా ఈ కేసులో పట్టుబడిన వారికి జరిమానా విధించడమో.. కొన్నిరోజుల పాటు జైలు శిక్ష వేయడమో చేస్తుంటారు. కానీ కోర్టు మందుబాబుల్లో పరివర్తన తీసుకు వచ్చేందుకు అలాగే సమాజానికి కూడా ఉపయోగపడేలా ఓ వినూత్న తరహాలు శిక్ష విధించాలని భావించింది. ఇందులో భాగంగానే విశాఖ బీచ్ లో ఉన్న వ్యర్థాలను మందుబాబులు క్లీన్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ శిక్ష వల్ల మందుబాబుల్లో కొంతైనా పరివర్తన కలగడమే కాదు.. సొసైటీకి ఓ మంచిపని కూడా జరుగుతుందని భావంచింది.
ఇక కోర్టు విధించిన శిక్ష అమలు చేసేందుకు 52 మంది మందుబాబులను బీచ్ కి తీసుకు వెళ్లారు ట్రాఫిక్ పోలీసులు. బీచ్ లో ఉన్న వ్యర్థాలను ఏరివేశారు మందుబాబులు. విశాఖ మెజిస్ట్రేట్ కోర్టు తీసుకున్న నిర్ణయం.. వేసిన శిక్షతో మందుబాబులో మార్పు వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు స్థానికులు. ఇటీవల కేరళాలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన వారికి స్టేషన్ లో 1000 సార్లు ఇంపోజిషన్ రాయించిన విషయం తెలిసిందే.