విశాఖ బీచ్ లో శవమై తేలిన శ్వేత ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. భర్త ప్రేమకు దూరమై ఎంతో నరకాన్ని అనుభవించిందని స్పష్టంగా తెలుస్తోంది.
విశాఖ బీచ్ లో శ్వేత అనే గర్భిణీ మహిళ నగ్నం శవమై కనిపించిన విషయం తెలసింది. ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. మంగళవారం నుంచి కనిపించకుండా పోయిన ఆ మహిళ చివరికి నగరంలోని బీచ్ ఒడ్డున నగ్నంగా శవమై కనిపించింది. దీని కన్నా ముందు.. శ్వేత కనిపించకుండాపోవడంతో ఆమె అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే శ్వేత బీచ్ లో నగ్నంగా ఇసుక మధ్యలో శవమై కనిపించడం అందరినీ షాకింగ్ కు గురి చేసింది. అనంతరం ఈ ఘటనపై అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శ్వేత మరణంపై ఆమె తల్లి మాట్లాడుతూ.. భర్త నా కూతురుని ప్రేమగా చూసుకోలేదని, వారి వేధింపుల వల్లే నా కూతురు ఇలా చనిపోయిందంటూ శ్వేత తల్లి కన్నీరు మన్నీరుగా విలపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పెళ్లైన ప్రతీ మహిళ తాళికట్టిన భర్త నుంచి ఎంతో ప్రేమను ఊహిస్తుంది. కానీ, భర్త మాత్రం కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులకు ప్రాధాన్యతనిస్తూ కట్టుకున్న భార్యను పట్టించుకోవడం మానేసి దూరం పెడుతున్నారు. దీని కారణంగానే ఎంతో మంది మహిళలు తమలో తాము కుమిలుపోతూ చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు సమాజంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు శ్వేత విషయంలో కూడా అదే జరిగిందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పెళ్లైన నాటి నుంచి శ్వేత భర్తే సర్వస్వం అన్నట్టుగా బతికింది. ఉన్న ఊరిని, కన్న తల్లిని, కుటుంబాన్ని వదిలేసి అన్నీ భర్తే అంటూ భర్త నుంచి ఎంతో ప్రేమను ఊహించుకుంది. కానీ, పెళ్లై కొంత కాలం వరకు మణికంఠ భార్యతో ప్రేమగానే ఉన్నాడు. ఇక రాను రాను తల్లిదండ్రులు, అక్క, వాళ్ల కూతుళ్లపై ప్రేమను చూపించి భార్యపై ప్రేమను తగ్గించాడు.
భర్తలో ఈ మార్పును గమనించిన శ్వేత.. తనలో తాను కుమిలిపోతూ రాత్రిళ్లు గుండెలు పగిలేలా ఏడ్చింది. మొదట్లో ఇదంతా మాములే.. అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుని భర్తతో ప్రేమగా ఉండేందుకు ప్రయత్నించింది. మణికంఠ మాత్రం.. ప్రతీ చిన్న విషయానికి గొడవ పడుతూ శ్వేతను ప్రేమగా చూసుకోవడమే మానేశాడు. భర్త ప్రేమగా మాట్లాడకపోవడం, ఇష్టంతో దగ్గరకు తీసుకోకపోవడం ఇవన్నీ శ్వేత తట్టుకోలేకపోయింది. ఆ మహిళ భర్త నుంచి ఏదైతే కోరుకుందో అదే దక్కకపోవడంతో శ్వేత తీవ్ర మనోవేదనకు గురైంది. అన్నీ తానే అనుకున్న భర్తే ప్రేమగా చూసుకోకపోవడంతో శ్వేత ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. ఇక ఇలాంటి కష్టాలు కేవలం ఒక్క శ్వేతనే కాదు.. సమాజంలో ఎంతో మంది మహిళలు అనుభవిస్తున్నారు. పెళ్లైన చాలా మంది మహిళలు భర్త ప్రేమకు దూరమై, భర్త ప్రేమకు చూసుకోవడం లేదని బయటకు చెప్పలేక నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇక ఇన్ని కష్టాల నడుమ బతకలేక, భర్తను విడిచి ఉండలేక చివరికి ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. శ్వేత మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.