కళాశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివి దేశ భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన విద్యార్థులు ఈ మద్య క్షణికావేశంలో కొట్టుకోవడం చూస్తున్నాం. విద్యార్థులమనే సంగతి మరచి గ్యాంగులుగా ఏర్పడి నడిరోడ్డుపై కొట్టుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా రోడ్డు పై చిన్న చిన్న గొడవలకు అబ్బాయిలు కొట్టుకోవడం.. తన్నుకోవడం చూస్తుంటాం. కానీ ఈ మద్య అబ్బాయిలకు ధీటుగా అమ్మాయిలు సైతం రోడ్డు పై జుట్టు పట్టుకొని వీర కొట్టుడు కొట్టుకోవడం చూస్తున్నాం. వీటికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
కాలేజ్ కి వెళ్లి బుద్దిగా చదువుకోమని తల్లిదండ్రులు చెబితే ఇద్దరు విద్యార్థినులు మాత్రం రోడ్డు పై పది మంది చూస్తున్నారన్న జ్ఞానం లేకుండా సిగపట్లు పట్టారు. ఆ ఇద్దరు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జుట్లు పట్టుకొని, పిడుగుద్దులు గుద్దుకున్న సంఘటన సంచలనంగా మారింది. అయితే వారిద్దరూ కొట్టుకోవడానికి గల కారణం ఏమిటో తెలియగాని, అక్కడ సహ విద్యార్థులు కొట్టుకోవద్దు అని ఎంత వేడుకున్నా అవేమి పట్టించుకోకుండా ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ నానా హంగామా సృష్టించారు.
ఇక ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడం చూసి కొంత మంది ఆపడానికి ప్రయత్నించినప్పటికీ వారు పట్టించుకోకుండా అలాగే కొట్టుకున్నారు. ఈ గొడవ అక్కడ ఉన్న స్థానికుడొకరు సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి కాస్త వైరల్ అయ్యాయి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుతారని విద్యార్థులను కళాశాలకు పంపిస్తే.. అందరూ చూస్తుండగానే విద్యార్థినిలు అలా దాడి చేసుకోవడంతో సిగ్గు చేటు అని స్థానికులు అంటున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.