“ప్రస్తుతం కొందరు నాయకులు చేసే చేష్టలు రాజకీయాలను రోత పుట్టిస్తున్నాయి. అటువంటి వారు నా మాటలను తీసుకుని పాత పద్ధతులకు వస్తారని భావిస్తున్నాను. ప్రజల్లో తిరుగుతూ వారికి మంచి పనులు చేయడంలో ఉండే సంతోషం రాజ్యాంగ పదవిలో లేదు. నాకు ఉపరాష్ట్రపతి హోదా అలంకారంగా అనిపిస్తోంది. స్వేచ్ఛగా తిరగాలని మనసు కోరుకుంటూ ఉంది” అని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వాఖ్యానించారు.
The Vice President releasing a coffee table book ‘Vijayapatham lo Nelloreeyulu’ at ‘Tunga Panduga’ celebrations in Nellore today. pic.twitter.com/vUDmAgL5ar
— Vice President of India (@VPSecretariat) November 12, 2021
మూడు రోజుల పర్యాటన నిమిత్తం నెల్లూరు వచ్చిన వెంకయ్యనాయుడు. నగరంలోని వీపీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ‘లాయర్ పత్రిక’ 40వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. త్వరగా ఢిల్లీ నుంచి నెల్లూరుకు తిరిగి వచ్చి సమాజ సేవ చేయాలని ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. కానీ అందరూ తాను రాష్ట్రపతి అవ్వాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నేడు ఒక పత్రిక చదివితే నిజం తెలియడం లేదని నాలుగైదు పత్రికలు చదివితేకాని అసలు విషయం అర్థం చేసుకోలేకపోతున్నామన్నారు. సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా తయారైయింది. దీనిని కట్టడి జరగాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు మాతృభాషలో మాట్లాడితేనే భాష మనుగడ సాగిస్తుందని భాష లేకపోతే వ్యక్తీకరణ సాధ్యం కాదన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఛైర్మన్ జి.సతీష్ రెడ్డి, శాంతా బయోటెక్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ కె.వరప్రసాద్రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ కొల్లి శ్రీనాథ్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
The Vice President, Shri M. Venkaiah Naidu, speaking at the ‘Tunga Panduga’ celebrations, commemorating the 40th anniversary of the weekly, ‘Lawyer’ in Nellore today. pic.twitter.com/49UB0P6VkT
— Vice President of India (@VPSecretariat) November 12, 2021
నెల్లూరుకు చెందిన లాయర్ వార పత్రిక 40 వసంతాలను పూర్తి చేసుకోవడం ఆనందదాయకం. ఈ సందర్భంగా పత్రిక వ్యవస్థాపకులు శ్రీ తుంగా రాజగోపాలరెడ్డి గారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. విలువలను పాటిస్తూ, 40 ఏళ్ళుగా ఓ పత్రిక కొనసాగుతూ ఉండడం అభినందించదగిన అంశం. pic.twitter.com/yHWLR6VKGC
— Vice President of India (@VPSecretariat) November 12, 2021