వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గురించి రాజకీయలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెల్లూరులోనే కాక.. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి ఆనం. ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం.. వైసీపీ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గురించి రాజకీయలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెల్లూరులోనే కాక.. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి ఆనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం వైసీపీ తరపును వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే కొంతకాలం నుంచి అధిష్టానానికి ఆయనకు మధ్య కోల్డ్ వార్ నడిచింది. వివిధ పరిణామాలతో వైసీపీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆయన ఏపీ రాజకీయలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నెల్లురూ జిల్లా కావలి పరిధిలోని వరికుంటపాడులో మాజీ ఏఎంసీ ఛైర్మన్ అండ్రా నాగిరెడ్డి నివాసంకి ఆనం రామనారాయణ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనం ఉదయగిరి నియోజక వర్గం పరిస్థితులపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆనం మాట్లాడుతూ..ఈ ఏడాది ఆఖరులో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్నారు.అలా కానీ పక్షంలో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు 60 శాతం మంది టీడీపీలో చేరుతారని.. అధికారం ఉందనే కొంతమంది వారి పనుల కోసం తాత్కాలికంగా వైసీపీలో ఉంటున్నారని ఆనం తెలిపారు.
ఇక తన రాజకీయం గురించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. తాను ఎంపీ స్థానానికి పోటీ చేసే ప్రసక్తి లేదని.. అదంతా తప్పుడు ప్రచారం అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానన్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులతోపాటు ఆ పార్టీ నాయకుల్లోనూ సొంత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ఎమ్మెల్యే ఆనం ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరి.. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.