Upasana And Brahmani: ఆడవాళ్లు వంటింటి కుందేళ్లన్నది ఆ నాటి మాట.. ఆడవాళ్లు సంఘాన్ని శాసించే మహా శక్తులన్నది ఈ నాటి మాట. రంగం ఏదైనా మహిళలు తమదైన ముద్ర వేసుకుంటున్నారు. తమ ప్రతిభతో ఆ రంగానికే వన్నె తెస్తున్నారు. శక్తివంతమైన మహిళలుగా పలువురికి స్పూర్తిగా నిలుస్తున్నారు. దేశంలో శక్తివంతమైన మహిళలుగా పేరు తెచ్చుకున్న వారిలో తెలుగు మహిళలు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్ది మందిలో ఉపాసనా కొణిదెల, నారా బ్రాహ్మిణి ముందు వరసలో ఉంటారు. వీరిద్దరూ ఉన్నత కుటుంబాలకు చెందిన బిడ్డలు.. ప్రస్తుతం ఉన్నత కుటుంబాల్లో కోడళ్లుగా అత్తింటి బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు. ఉపాసన బిజినెస్ నేపథ్యం ఉన్న కుటుంబంలోంచి సినీ కుటుంబంలోకి అడుగుపెడితే.. బ్రాహ్మణి సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలోంచి రాజకీయ కుటుంబంలోకి అడుగుపెట్టారు. ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. ప్రస్తుతం ఉపాసన పుట్టింటి బిజినెస్‌లోకి.. బ్రాహ్మణి అత్తింటి బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. చిన్న వయసులో విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తలుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.
ఉపాసన విషయానికి వస్తే.. ప్రతాప్ సీ రెడ్డి వారసురాలిగా ‘‘అపోలో’’ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. అపోలో ఫౌండేషన్‌కు వైస్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. పలు మ్యాగజైన్లకు ఎడిటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు! బాధ్యతలతో ఎంత సతమతమవుతున్నా సేవా కార్యక్రమాల విషయంలో మాత్రం వెనక్కు తగ్గరు. తన సేవలకు గానూ మహాత్మా గాంధీ అవార్డును, ఫిలాంత్రపిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2019గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి కోడలిగా కొణిదెల కుటుంబంలోకి అడుగుపెట్టారు. 2012లో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మెట్టినింటకూడా మంచి కోడలనిపించుకుంటున్నారు. అత్తా,మామల ప్రేమాభిమానాలను చూరగొంటున్నారు. భర్త రామ్ చరణ్‌కు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు అందిస్తూ అటు కోడిలిగా ఇటు భార్యగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇక నారా బ్రాహ్మిణి విషయానికి వస్తే.. తెలుగు సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు మనవరాలిగా, స్టార్ హీరో నందమూరి బాలక్రిష్ణ కూతురిగా అందరికీ సుపరిచితమే. పెద్ద కుటుంబంలోంచి వచ్చిన మహిళైనప్పటికి ఎంతో డౌన్‌టు ఎర్త్ నేచర్ కలవారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలోకి అడుగుపెట్టారు. 2007లో మేన బావ నారా లోకేష్‌ను వివాహం చేసుకున్నారు. ఓ బిడ్డ పుట్టిన తర్వాతనుంచి అత్తింటి ‘‘ హెరిటేజ్’’ బిజినెస్ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. హెరిటేజ్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డెరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిజినెస్ ఉమన్‌గా పలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. నందమూరి ఇంటినుంచి నారా వారి ఇంట్లోకి అడుగుపెట్టిన బ్రాహ్మణి.. అత్తింట మంచి కోడలనుపించుకుంటున్నారు. ఓ వైపు కుటుంబం, బిజినెస్ బాధ్యతలతో పాటు మరో వైపు తల్లిగా తన బిడ్డ బాధ్యతల్ని కూడా చూసుకుంటున్నారు. మరి, సగటు మహిళా లోకానికి స్పూర్తిగా నిలిచే ఈ ఇద్దరిలో మీకు ఎవరు బాగా నచ్చుతారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Mahesh Babu: మహేశ్ బాబు ఫొటో షూట్ వీడియో అవుట్! లుక్స్ చూస్తే మైండోపోవాల్సిందే!