శ్రీకాకుళం జిల్లాలో వింత డ్రోన్ కలకలం రేపింది. సంతబొమ్మాళి మండలం భావనపాడు- మూలపేట తీరంలో మత్స్యకారులకు ఈ డ్రోన్ దొరికింది. దీని గురించి మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. చేపల కోసం వల వేయగా వారి వలలో బరువైన వస్తువు చిక్కింది. అవి చేపలు అనుకుని బయటకు లాగి చూడగా డ్రోన్ కనిపించింది. వెంటనే మత్స్యకారులు మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. అది విదేశీ డ్రోన్ అని అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.
భావనపాడు మెరైన్ పోలీసులు ఆ డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రోన్ దాదాపుగా 9 అడుగుల పొడవు, 111 కిలోల బరువు ఉంది. దాని ఆకారం చూడటానికి అచ్చు విమానంలాగానే ఉంది. ఆ డ్రోన్ పై 8001 అనే నంబర్, రెక్కలపై బ్యాన్ సీ టార్గెట్ అని అక్షరాలు రాసున్నాయి. దీనిని మిలటరీ డ్రోన్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. మిసైల్స్ ప్రయోగం సమయంలో విఫలమై సముద్రంలో పడి ఉండచ్చని భావిస్తున్నారు. మరోవైపు దీనిని వాతావరణాన్ని పరిశీలించే డ్రోన్ గా కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Aerial target drone ‘Banshee’ caught in fishermen’s net in Srikakulam dist, handed over to police. Navy, Intelligence Agency informed. #AndhraPradesh pic.twitter.com/KsmCO7OiSO
— Ashish (@KP_Aashish) February 2, 2023
దీనికి ఎలాంటి కెమెరాలు లేవని స్పష్టం చేశారు. కానీ, రేడియో సిగ్నల్స్ పంపగలిగే సామర్థ్యం ఉన్న కొన్ని పరికరాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ డ్రోన్ వ్యవహారంపై నేవీ అధికారులతో పాటుగా కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై మాత్రం స్పష్టమైన సమాచారం లేదు. కానీ, విదేశీ డ్రోన్ కూడా అయి ఉండచ్చనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్థానికంగా ఈ డ్రోన్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. కొందరు ఇది ప్రమాదకరమా? అనే అనుమానాలను లేవనెత్తుతున్నారు.
An aerial target #drone jet #Banshee #Target , created a commotion at a beach near Bhavanapadu in Santhabommali mandal in #Srikakulam dist, after the fishermen who went fishing saw a drone jet floating on the water, immediately informed the Police.#AndhraPradesh #drones pic.twitter.com/mTnJtrdovp
— Surya Reddy (@jsuryareddy) February 2, 2023