Andhra Pradesh: ఇంజనీరింగ్ కాలేజీ వెనుక పొదల్లో మంచం! గుట్టలుగా క*డోమ్ ప్యాకెట్లు!

  • Written By:
  • Publish Date - May 28, 2022 / 06:35 PM IST

విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన యూనివర్సిటీలు అసాంఘిక కార్యకలాపాలకు నెలవులుగా మారుతున్నాయా? అంటే.. కొన్ని యూనివర్సిటీలకు సంబంధించిన వివరాలను గమనిస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పెడదారిన పడుతున్నారనే వార్తలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. యూనివర్సిటీ ప్రాంగణాన్ని చెడు పనులకు ఉపయోగిస్తున్నారనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ బాయ్స్ హాస్టల్ వెనుక యూనివర్సిటీ ఏరియాను శుభ్రం చేస్తూ దట్టమైన పొదలను, చెట్లను తొలగిస్తున్నారు. అక్కడ కనిపించిన ఓ డెన్ ని చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ వెనుక దట్టంగా వెదురు చెట్లు పెరిగి ఉండడంతో, ఆ చెట్ల పైన ఒక డెన్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. అక్కడ ఏం జరిగింది అనే విషయాలు ఆరాతీసే క్రమంలో ఓ మంచె, దానిపై పరుపు సెటప్, పైకి ఎక్కడానికి ఒక నిచ్చెన ఏర్పాటు చేశారు.

ఇక ఆ స్థలంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అనడానికి నిదర్శనంగా గుట్టలుగుట్టలుగా కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాలు, సిరంజీలు, సిగిరెట్ ప్యాకెట్లు కనిపించాయి. వందల సంఖ్యలో అక్కడ కండోమ్ ప్యాకెట్లు దొరకడంతో పలు అనుమానాలకు దారితీసింది. అక్కడున్న మంచెను ఆధారం చేసుకొని వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాని అనుమానాలు వ్యక్తమ్ చేస్తున్నారు. అంతేగాక పొదల వద్ద మద్యం బాటిల్ లతో పాటు సిరంజిలు దొరకడం, గంజాయిని వినియోగించిన ఆనవాళ్లను కూడా యూనివర్సిటీ అధికారులు గుర్తించారు.

డ్రగ్స్ కి సంబంధించిన సిరంజీలు కనిపించడంతో యూనివర్సిటీలో డ్రగ్స్ వినియోగం జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ వ్యవహారం వెనుక యూనివర్సిటీ విద్యార్థులే కాకుండా.. పెద్ద నెట్వర్క్ ఉందని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. అసలు ఈ డెన్ ఏర్పాటు చేసింది ఎవరు? ఈ వ్యవహారంలో ఎవరెవరికి సంబంధాలున్నాయి? యూనివర్సిటీ క్యాంపస్ లోపల సెక్యూరిటీ ఉండగా దందా ఎలా జరుగుతుంది? అనే విషయాలపై విచారణ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్ వెనుక భాగంలో హిజ్రాలు ఎక్కువగా నివసిస్తుంటారని, వారే ఆ ఏరియాను అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని.. ఈ విషయమై ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశామని యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి చెప్పినట్లు సమాచారం. ఇక ఏదేమైనా విద్యాబోధన జరిగే పరిసరాల్లో ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడటం హానికరమని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దీనిపై యూనివర్సిటీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV