నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మర్రిపాడులోని ఆయన నివాసంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా ఆయనకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన్ను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మర్రిపాడులోని ఆయన నివాసంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గురువారం మేకపాటి ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్ కి వెళ్లి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం వైసీపీ నేత సుబ్బారెడ్డి.. ఉదయగిరికి వచ్చారు. తాను లేనప్పుడు రావడం కాదని ఇప్పుడు రమ్మంటూ ప్రతి సవాళ్లు విసిరారు. ఈ క్రమంలో ఉదయగిరి వెళ్లాల్సిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.
ఇటీవల జరిగిన ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేశారనే ఆరోపణలతో వైసీపీ అధిష్టానం మేకపాటిని సస్పెండ్ చేసింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రెబల్ గా మారారు. ఈ తరువాత నుంచి ఉదయగిరి వైసీపీ నేతలకు ఎమ్మెల్యేకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈక్రమంలో పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. దమ్ముంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిలో అడుగు పెట్టాలంటూ వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి సవాళ్లు విసిరారు.
ఈక్రమంలో గురువారం ఎమ్మెల్యే ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో వచ్చి.. నడి రోడ్డుపై కుర్చి వేసుకుని కూర్చున్నారు. తాజాగా శుక్రవారం వైసీపీ నేతలు మరోసారి సవాళ్లు విసిరారు. తాము లేనప్పుడు రావడం కాదని.. దమ్ముంటే ఇప్పుడు రమ్మని మరోసారి సవాల్ చేశారు. ఈక్రమంలో మర్రిపాడులో ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఈ విషయంపై మీడియా వాళ్లు ప్రశ్నించగా తనకు ఆరోగ్యం సరిగా లేదని.. ఇప్పుడేమీ మాట్లాడలేనని చెప్పారు. ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైకి తరలించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో కూడా ఆయనకు గుండెపోటు వచ్చిందన సంగతి తెలిసిందే. ఆయన్ను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించిన ఎమ్మెల్యేకు గుండెలో రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు గుర్తించారు. ఆయన్ను మెరుగైన చికిత్స కోసం చెన్నై ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకున్న చంద్రశేఖర్ రెడ్డి కోలుకున్నారు. 2021 డిసెంబర్‌లో కూడా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు రావడంతో బెంగళూరులో సర్జరీ చేసి స్టెంట్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం మరోసారి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.