మనిషికి ఆపదొస్తే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ లు ఉండవు. పోనీ సొంత వాహనాల్లో తీసుకెళదామంటే అసలు రోడ్లే ఉండవు. దీంతో మనిషికి జబ్బు చేస్తే భుజాన మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లడమే. మారుమూల గ్రామాల్లో బతికే జనాల పరిస్థితి ఇదే.
దేశం సాంకేతికంగా ఎంతో ముందుకు పోతున్నా కూడా ఇంకా సరైన తాగునీటి సదుపాయం, సరైన రోడ్లు, అసలు రవాణా సౌకర్యం లేనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అంబులెన్స్ రావాలంటే రావడం కుదరదు. ఎందుకంటే రోడ్డు సదుపాయం ఉండదు. ఏ అనారోగ్యమో వస్తే ఇద్దరు మనుషులు మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇక పురిటి నొప్పులు వస్తే అంతే సంగతులు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోతే తల్లికి, బిడ్డకీ ఇద్దరికీ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇదీ గిరిజన ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, ఆదివాసీల బతుకు చిత్రాలు. కంటతడి పెట్టించే సంఘటనలు ఎన్ని కనబడుతున్నా గానీ ప్రభుత్వాల్లో మాత్రం చలనం రావడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ గర్భిణీని ఇద్దరు యువకులు భుజాలపై మోసుకుంటూ రావడం కంటతడి పెట్టిస్తోంది. భుజాల మీద ఒక మనిషిని మోసుకుంటూ పదడుగులు వేయాలంటేనే భుజాలు నొప్పి వస్తాయి. అలాంటిది మూడు కిలోమీటర్ల పాటు మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకురావడానికి చాలా ఓపిక ఉండాలి. నిజంగా అంబులెన్స్ చేయాల్సిన పనిని ఆ గిరిజనులు చేస్తున్నారు. వీరు చేస్తున్న పనికి సెల్యూట్ చేయాలో లేక సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందినా వారికి కనీసం ప్రాణం నిలబెట్టుకోవడానికి అనుకూల పరిస్థితులు లేవని బాధపడాలో అర్థం కాని పరిస్థితి.
ఒక కర్రని ఒక చివర ఒకరు,మరొక చివర మరొకరు భుజాన ఎత్తుకుని.. మధ్యలో దుప్పటి కట్టి అందులో గర్భిణీని తరలిస్తున్నారు. అలా 3 కి.మీ. పాటు మోసుకుంటూ వెళ్లారు. ఇంతకంటే కష్టం ఇంకెక్కడైనా ఉంటుందా? ఈ వీడియో చూసి నెటిజన్లు కంటతడి పెట్టుకుంటున్నారు. తమ ప్రాంతానికి రోడ్లు వేయమని స్థానిక నేతలను వేడుకున్నారు. మరి ఇప్పటికైనా స్థానిక నేతలు స్పందించి వారి ప్రాంతంలో రోడ్లు వేస్తారేమో చూడాలి. వారి సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా షేర్ చేయండి. అలానే ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.
ఆదివాసిలకు తప్పని డోలి మోతలు.. గర్భిణీ స్త్రీని మోసుకుంటూ మూడు కిలోమీటర్ల ప్రయాణం | News18 Telugu#doli #adivasi #news18telugu pic.twitter.com/4dyORQ5exy
— News18 Telugu (@News18Telugu) February 22, 2023