మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడి వాతావరణం కాస్త చల్లబడింది అనుకునే లోపు మళ్లీ భానుడు ప్రభావంతో విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. ప్రజలకు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎండవేడిమి ప్రజలకు చుక్కులు చూపిస్తుంది. వేసవి తాపం తట్టుకోలేక ప్రజలు శీతలపానియాల వైపు పరుగులు తీస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోయే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణో అవుతున్నాయి.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. సోమవారం నుంచి వడగాల్పులు వీస్తాయని.. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ మద్య నమోదు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయే అవకాశం ఉందని.. ఈ విషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో రెండు రోజుల నుంచి ఎండ ప్రభావం తీవ్రంగా మారిందని.. మెకా తుఫాన్ ప్రభావం వల్లనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారిపోయాయి. ఉష్ణోగ్రతలతో పాటుగా గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో రెండుమూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఉన్నట్లు కనిపించిందని అధికారులు తెలిపారు.
ఏపిలో గరిష్ణ ఉష్ణోగ్రత సుమారు 45 డిగ్రీలకు చేరువైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 153 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచానా వేసింది. బాపట్లలో అత్యంగ గరిష్టం.. 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 44.7 డిగ్రీలు, పోలవరం 44.6, ప్రకాశం జిల్లా 44.5 , గుంటూరులో 48 డిగ్రీలు, విజయవాడలో 45 డిగ్రీలు, అనంతపురం 44 , కాకినాడ 46, ఏలూరులో 45, విశాఖలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అనకాపల్లి, కోనసీ, గోదావరి జిల్లాల్లో 47 డిగ్రీలు, కృష్ణ, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు వర్షాలు కురిసినా.. మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. హైదరాబాబాద్‌లో నిన్న ఒక్క రోజు 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని.. రేపు 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కొడాలపూర్ లో 45.9 డిగ్రీలు, అర్లిటిలో 44.8 డిగ్రీలు, బుట్టపూర్ లో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పలు ప్రాంతాల్లో 46 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐఎండీ తెలిపింది. రాగల 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉండటం వల్ల దిగువ స్థాయిలోని గాలులు వాయవ్వ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వాతావరణంలో వచ్చిన మార్పులు ప్రజలు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎండల ప్రభావం వల్ల 18 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే హడలిపోతున్న ప్రజలు. ఖాళీగా మారిన ప్రధాన రహదారులు డిగ్రీలు, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు రావాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల ప్రభావంతో పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రజల రద్దీ భారీగా తగ్గిపోయింది.