ఈ మధ్యకాలంలో అడ్డదారులో డబ్బులు సంపాదించే వారు ఎక్కువయ్యారు. సులువుగా డబ్బులు పొందాలనే ఆలోచనతో దారుణలకు పాల్పడుతున్నారు. అవినీతి మార్గంలో డబ్బులు పొందే ప్రయత్నంలో భాగంగా జైలు పాలవుతున్నారు.
నేటికాలంలో సులువుగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కేవారు ఎక్కవయ్యారు. దొంగతనాలు చేయడం, ఇతరులను మోసం చేసి వారి నుంచి నగదు, డబ్బులు కాజేయడం వంటివి చేస్తుంటారు. మరికొందరు అతితెలివితో బ్యాంకులను మోసం చేస్తుంటారు. తాజాగా ఇద్దరు యువకులు అలాంటి మాస్టర్ ప్లాన్ ఒకటి వేశారు. క్యాష్ డిపాజిట్ మిషిన్ లో డబ్బులు జమ చేశారు. అయితే కేవలం సగం డబ్బు మాత్రమే డిపాజిట్ అయినట్లు గుర్తించారు. మిగిలి సొమ్ము ఎందుకు డిపాజిట్ కాలేదని అడిగేందుకు సదరు వ్యక్తులు బ్యాంకుకు వెళ్లారు. వివరాలు కనుకునేందుకు వెళ్లిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి.. ఎందుకు అరెస్ట్ చేశారు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం బైలపూడి లోగ్రామంలోౌ గుమ్మడి నిరంజన్ అనే వ్కక్తి నివాసం ఉంటున్నారు. అతడు ఈ నెల 12న అనకాపల్లిలోని యాక్సిస్ బ్యాంక్ క్యాష్ డిపాజిట్ మెషిన్‌లో డబ్బులు డిపాజిట్ చేశాడు. గుమ్మడి నిరంజన్ తన ఖాతాలో రూ.70 వేల నగదు డిపాజిట్ చేశాడు. అతడు మొత్తం రూ.500 నోట్లను డిపాజిట్ మెషిన్ లో జమా చేశాడు. రూ.70 వేల నగదు ను జమా చేస్తే రూ. 46 వేలు మాత్రమే అకౌంట్‌లో జమయ్యాయి. అయితే మిగిలిన నగదు ఎందుకు డిపాజిట్ కాలేదని కనుకునేందుకు సదరు వ్యక్తి బ్యాంకుకు కి వెళ్లాగా.. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని సదరు వ్యక్తి ప్రశ్నించగా బ్యాంకు అధికారులు విస్తుతపోయే నిజాలు చెప్పారు.
గుమ్మడి నిరంజన్ డిపాజిట్ చేసిన మొత్తం 140 నోట్లలో 48 నకిలీవి అని తేలింది. ఆ నకిలీ నోట్లు వేరే బాక్సులో పడ్డాయి. డిపాజిట్ బాక్స్‌లో నకిలీ రూ. 500 నోట్లు 48 ఉన్నాయని బ్యాంకు మేనేజర్ ఈనెల 16నే గుర్తించారు. వెంటనే అనకాపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నకిలీ నోట్ల విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో నిరంజన్ తన డబ్బులు అకౌంట్‌లో డిపాజిట్ కాలేదని బ్యాంకుకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించాడు. అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిరంజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితోపాటు రాము అనే వ్యక్తి నకిలీ నోట్లు మారుస్తున్నట్లు గుర్తించారు. నిందితులు కోర్టులో హాజరుపరిచారు. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.