కర్నూలు జిల్లా వజ్రాల వేటకు పెట్టింది పేరు. అక్కడ తొలకరి వానలు కురిశాయంటే.. వజ్రాల వేట మొదలవుతుంది. అలా వజ్రాల వేటతో చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కొందరిని అదృష్టం వరించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇటీవల అక్కడ కురిసిన వానలకు కూడా ఇద్దరి రైతులను అదృష్టం వరించింది. పొలం పనులకు కూలీగా వెళ్లిన ఆ ఇద్దరి రైతులకు వజ్రాలు దొరికాయి. కర్నూల్ జిల్లాలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామంలో పొలంలో పని చేస్తున్న కూలీలకు రెండు వజ్రాలు లభ్యమయ్యాయి.
ఒకరి వజ్రం 80 వేల రూపాయలు మరో వజ్రం 50 వేల రూపాయలకు స్థానిక వజ్రాల వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా రెండు జతల కమ్మలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కూలీకి వచ్చిన వాళ్లకు అదృష్టం కలిగినట్లైంది. ఈ విషయంపై మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియోను వీక్షించండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.