టీవీ సరిగ్గా పనిచేయకపోయినా.. రిమోట్ పై టపీ టపీ మని నాలుగు దెబ్బలు వేస్తారు. అంతేనా భార్యా భర్తల మధ్యలోనైనా, అన్నా చెల్లెల్ల, ఇతర కుటుంబ సభ్యుల మధ్య గొడవల్లోనైనా ముందుగా పగిలిపోయేది టీవీ రిమోట్. ఇంట్లో వాళ్లు మనకు నచ్చని చానల్ పెడితే ఏం చేస్తారు.. ముందుగా టీవీ రిమోట్ దాచేస్తారు.. కానీ ఓ ఘనుడు..
టీవీ రిమోట్ కనుక మనస్సు ఉంటే.. కచ్చితంగా మనుషులపై పగ తీర్చుకుంటుంది. ఎందుకంటే ఇంట్లో అత్యధికంగా ప్రభావితమయ్యే వస్తువు ఏదైనా ఉందంటే టీవీ రిమోటే. టీవీ సరిగ్గా పనిచేయకపోయినా.. దానిపై టపీ టపీ మని నాలుగు దెబ్బలు వేస్తారు. అంతేనా భార్యా భర్తల మధ్యలోనైనా, అన్నా చెల్లెల్ల, ఇతర కుటుంబ సభ్యుల మధ్య గొడవల్లోనైనా ముందుగా పగిలిపోయేది టీవీ రిమోట్. ఇంట్లో ఏ వస్తువైనా ఎన్నో సంవత్సరాలకు మారుతుంటాయి.. కానీ టీవీ రిమోట్ మాత్రం ఏడాదిలో రెండు మూడు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇంట్లో వాళ్లు మనకు నచ్చని చానల్ పెడితే ఏం చేస్తారు.. ముందుగా టీవీ రిమోట్ దాచేస్తారు. అది ఎవ్వరికి కనిపించని ప్రాంతాల్లో ఉంచుతారు. కానీ ఓ మూర్ఖుడు అత్యంత జుగుప్పాకరమైన ప్రాంతంలో దాచి వార్తల్లో నిలిచాడు.
మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో మర్చిపోయి టీవీ రిమోట్‌ను ఏకంగా మల ద్వారంలో చొప్పించుకున్నాడో ఘనుడు. ఆ ప్రాంతంలో ఎలా దాచాడురా బాబు అనుకుంటున్నారా. వినడానికే ఏదోలా అనిపిస్తున్న ఇది నిజం. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. అనంతపురం ప్రభుత్వాసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. పెనుకొండ నియోజకవర్గానికి చెందిన యువకుడు..మద్యం మత్తులో టీవీ రిమోట్‌ను మలద్వారంలో పెట్టుకుని ఆ తర్వాత నొప్పిగా ఉందని ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. వైద్యులు పరీక్షించగా.. మల ద్వారంలో టీవీ రిమోట్ లోని కొంత భాగం కనిపించింది. ఆసుపత్రిలో చేర్చి.. బయటకు తీసేందుకు ప్రయత్నించగా రాలేదు.
అతడికి అనస్తీషియా ఇచ్చి దాన్ని బయటకు తీసినట్లు వైద్యులు వెల్లడించారు. వైద్య బృందం శస్త్రచికిత్స లేకుండా సురక్షితంగా బయటకు తీసింది. సర్జన్ రష్మి, పీజీ వైద్యురాలు లీలా మౌనిక, డాక్టర్ దివ్య, అనస్తీషియా వైద్యులు డాక్టర్ మురళీ ప్రభాకర్, డాక్టర్ హరికృష్ణ, స్టాఫ్‌నర్సు నాగలక్ష్మి బృందం మత్తు మందు ఇచ్చి గంటపాటు శ్రమించి ఎటువంటి సర్జరీ చేయకుండానే చేతితోనే రిమోట్‌ను బయటకు తీశారు. వైద్య బృందాన్ని ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.