శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కరోనా మొదలనప్పుడు నిలిచిపోయిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. ఏప్రిల్, మే, జూన్ మొత్తం 3 నెలలకు సంబంధించి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ టికెట్లను టీటీడీ సైట్ లో విడుదల చేశారు. ఈ టికెట్లను వర్చువల్ క్యూ పద్ధతిలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ గెట్ విధానంలో కేటాయిస్తారు.
ఇదీ చదవండి: మేడారం వివాదంపై స్పందించిన చిన్న జీయర్ స్వామి!
టికెట్లను మార్చి 20 నుంచి మార్చి 22 ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు చేసుకోవచ్చు. 22న ఉదయం 10 గంటల తర్వాత వారి పేర్లను తమ వెబ్ సైట్లో పొందుపరుస్తామని టీటీడీ ప్రకటించింది. టికెట్లు పొందిన భక్తులు రెండ్రోజులలోపు ధర చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే టికెట్లు పొందుతారో వారికి ఎస్‌ఎంఎస్, మెయిల్ ద్వారా వివరాలు అందుతాయని వెల్లడించారు. ఏప్రిల్ ఒకటి నుంచి శ్రీవారికి ఆర్జిత సేవలు ప్రారంభం కానున్నాయి. పండగలు, ప్రత్యేక రోజుల్లో శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు కానున్నట్లు అధికారులు తెలిపారు. ఉగాది సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవలు, ఏప్రిల్ 14 నుంచి 16 వరకు ఆలయంలో కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవల్ని రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. టీటీడీ నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Arjitha Seva Tickets update
Releasing on March 20th #tirumala #tirupati #govind #ttd #gopala pic.twitter.com/uwsffwAHkM— United Tirupati (@TirupatiUnited) March 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.