శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఎప్పటికప్పుడు వారికి సౌకర్యాలు కల్పిస్తూ వస్తుంది. తిరుమలకు సంబంధించి టీటీడీ తీసుకునే నిర్ణయాలను కూడా భక్తలకు తెలియజేస్తారు. తాజాగా శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ శుభవార్త చెప్పింది. సర్వదర్శనం భక్తులకు విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
గతంలో శ్రీవారి సర్వదర్శనం భక్తులకు గంటలకు పై క్యూ లైన్ లో వేచి ఉండే వారు. ఇకపై ఎలాంటి నిరీక్షణ లేకుండా గంటన్నర వ్యవధిలోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన సౌకర్యం కల్పించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రద్దీకి అనుగుణంగా సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలను తీసుకోవడం లేదని చెప్పారు. సర్వదర్శన భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా ఏర్పాటు చేస్తున్నామని ఈవో తెలిపారు.
ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం.. టీటీడీ చరిత్రలో ఇదే అత్యధికం!
తిరుమలలో దళారీ వ్యవస్థను నిరోధించడం ద్వారా రూ. 215 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా స్వామి వారికి చేరుతున్నాయన్నారు. గత రెండున్నరేళ్లలో రూ. 1500 కోట్ల విరాళాలను తీసుకురాగలిగామన్నారు. తిరుమలలో 7,500 గదులకు 40 ఏళ్లుగా మరమ్మతులు చేయలేదని, కరోనా సమయంలో 4,500 గదులకు మరమ్మతులు చేసినట్టు వివరించారు. సెప్టెంబరు నాటికి మిగతా గదులకు కూడా మరమ్మతులు పూర్తిచేస్తామని ధర్మారెడ్డి తెలిపారు. మరి.. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.