విజయవాడ, విశాఖపట్నం మధ్య నడిచే రైళ్ల రాకపోకాలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఎక్కడివి అక్కడ అగిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైల్వే జంక్షన్ సమీపంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
విజయవాడ, విశాఖపట్నం మధ్య నడిచే రైళ్ల రాకపోకాలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఎక్కడివి అక్కడ అగిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైల్వే జంక్షన్ సమీపంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నిడదవోలు సమీపంలో ఉన్న ఎల్ సీ 383వద్ద పవర్ బ్రేక్ అయింది. రైల్వే ట్రాక్ పై వెళ్తున్న 11కె.వి విద్యుత్ తీగ తెగి రైల్వే ఓహెచ్ఈపై పడింది. దీంతో మార్గం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రైల్వే అధికారులు సమీపంలో నిలిచిన గూడ్స్ రైలు, రాజమండ్రి వైపు వచ్చే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. అలానే విజయవాడ, విశాఖ పట్నం మధ్యలో నడుస్తున్న రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.
ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన నిడదవోలు స్థలానికి చేరుకుని విద్యుత్ లైన్ మరమ్మతులు చేపట్టారు. పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి రాజమండ్రి నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు పునరుద్ధరించారు. అయితే విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే రైళ్లు ఇంకా అలాగే నిలిచిపోయాయి. పలు రైళ్లు మూడు గంటలు ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.