తిరుపతి నుండి తిరుమలకు అలిపిరి నడక మార్గంలో నిన్న రాత్రి ఓ బాలిక తప్పిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిరుత దాడిలో బాలిక మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్నారి మృతితో కలకలం రేగింది. తిరుపతి నుండి తిరుమలకు నడక మార్గంలో నిత్యం చాలా మంది భక్తులు వెళుతుంటారు. కానీ కొన్నిసార్లు ఆ మార్గంలో అడవి మృగాలు సంచరిస్తుంటాయి. అవి భక్తులపై దాడికి పాల్పడుతుంటాయి. ఇటీవల ఓ బాలుడు చిరుత దాడితో తీవ్రంగా గాయపడ్డాడు. తిరిగి కోలుకుంటున్నాడు. ఆ ఘటన మరువకు ముందే మరో విషాదం నెలకొంది. చిరుత దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నిన్న నడక మార్గంలో ఓ చిన్నారి తప్పి పోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి మృతదేహం లభించింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..
అలిపిరి నడక మార్గంలో నిన్న రాత్రి ఓ బాలిక తప్పిపోయింది. బాలిక తల్లిదండ్రులు తమ ఆరేళ్ల కూతురు.. పేరు లక్షిత తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ద్వారా ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. కానీ బాలిక ప్రాణాలు కాపాడలేక పోయారు. ఈ రోజు ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. చిరుత దాడిలో చిన్నారి చనిపోయినట్లు నిర్ధారించారు. వీరు నెల్లూరు జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.
చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి లక్షిత మృతి చెందిన ఘటనతో టీటీడీ అలెర్ట్ అయింది. నడక మార్గంలో భక్తులు ఒంటరిగా వెళ్లకూడదని, గుంపుగా వెళ్లాలని హెచ్చరించింది. నెల రోజుల క్రితమే అదే ప్రాంతంలో ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. ఈ మార్గంలో చిరుత దాడి చేసిన ఘటనలు చాలానే ఉన్నా.. ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.