విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రలో భాగంగా వెళ్తున్న పర్యాటకుల పడవ బోల్తా పడింది.
విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ లో పర్యాటకుల పడవ బోల్తా పడింది. 12 మంది పర్యాటకులతో వెళ్తున్న పడవలోకి ఒక్కసారిగా నీరు రావడంతో బోల్తా పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన 12 మందిలో 10 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొక వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పర్యాటకులు తంజావూరుకు చెందినవారుగా భావిస్తున్నారు. ఇదే నెలలో మే 7న ఇలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది. టూరిజం బోటు బోల్తా పడడంతో 21 మంది దుర్మరణం చెందారు. 40 మందితో వెళ్తున్న పర్యాటకుల పడవ మలప్పురం జిల్లా తానూర్ సమీపంలో బోల్తా పడి నీట మునిగింది. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. చాలా మంది పడవ కింద చిక్కుకుంటే రెస్క్యూ అధికారులు వారిని రక్షించారు.
నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్‌లో పర్యాటక శాఖ పడవ బోల్తా.. 12 మంది గల్లంతు, ప్రాణాలతో బయటపడిన 10 మంది.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు ముమ్మరం #boataccident #AndhraPradesh #telugunews
— NTV Breaking News (@NTVJustIn) May 14, 2023